ముంబై: ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మంగళవారం సమీక్ష వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ వెల్లడించారు. కీలక వడ్డీరేట్లు, రెపోరేటు 6.75శాతం, రివర్స్ రెపోరేటు, నగదు నిల్వల నిష్పత్తి 4శాతం యథాతథంగా ఉంటాయని ఆయన ప్రకటించారు.
ద్రవ్యోల్బణంపై ఏడో వేతన సంఘం ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. బేస్‌రేటు లెక్కింపు కొత్త విధానంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశీయ ఉత్పత్తి రంగం ఉరకలెత్తుతున్న నేపథ్యంలో గడచిన త్రైమాసికంలో జీడీపీ అంచనాలను మించి 7.4 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు కూడా అవసరం లేదన్న భావన వ్యక్తమైందన్నారు. గడిచిన రెండు నెలలుగా ద్రవ్యోల్బణం ఎగువముఖం పట్టడం, అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచేందుకు సమాయత్తమవుతున్న ఈ తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇంట్రస్ట్‌రేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించవచ్చునని అత్యధికమంది అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఆర్‌బీఐ రాజన్ వడ్డీరేట్లపై వేచి చూసే ధోరణి అవలంభించవచ్చునని యూకో బ్యాంక్ ఎండీ, సీఈవో ఆర్‌కే ఠక్కర్ తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పప్పు దినుసుల ధరలు భగ్గుమండుతుండటం, టమాటా ధరలు అధికమవడంతో ఈ నెలలో ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న అంచనాతో రాజన్ రేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications