హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్లలో డేటా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌సెల్ సరికొత్త డేటా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా డేటా వినియోగం భారీగా పుంజుకుంటున్న నేపథ్యంలో కంపెనీ రూ.9 నుంచి రూ. 403 లోపు ప్రత్యేక ప్యాకేజీలను టెన్నిస్ స్టార్లు మార్టినా హింగిస్, విజయ్ అమృత్‌రాజ్‌లచే ఆవిష్కరింప జేసింది.
దీంట్లో ఒకరోజుకు రూ.9 చెల్లించి 100 ఎంబీ డేటాను 2జీ/3జీ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే రూ. 79కి పది రోజుల్లో 1జీబీ డేటా, 30 రోజుల కాలపరిమితిపై రూ. 249తో 3జీబీ డేటా, రూ. 403 రీచార్జిపై 7.5 జీబీ డేటాను 15 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది.

రూ. 9కే 100 ఎంబీ డేటా: ఎయిర్‌సెల్ కొత్త డేటా ప్యాకేజీలు
ఈ సందర్భంగా ఎయిర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కట్టమ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు తక్కువ ధరకే డేటా సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించినట్లు తెలిపారు. ఎయిర్‌సెల్ ఆదాయం లో 18శాతం డేటా నుంచి సమకూరుతోందన్నారు.

రూ. 9కే 100 ఎంబీ డేటా: ఎయిర్‌సెల్ కొత్త డేటా ప్యాకేజీలు
ఇప్పటికీ దేశంలో 80 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదని, వారంతా కొత్త వినియోగదారులుగా చేరుతుండటంతో ఈ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతోందని తెలియజేశారు. ప్రస్తుతం 40 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తూ అమెరికాను అధిగమించినట్లు తెలిపారు.

రూ. 9కే 100 ఎంబీ డేటా: ఎయిర్‌సెల్ కొత్త డేటా ప్యాకేజీలు
ప్రస్తుతం కంపెనీకి 8 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, దీంట్లో 30 శాతం మంది డేటాను వినియోగిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో డేటా వాటా 15-17 శాతంగా ఉందని చెప్పారు.

రూ. 9కే 100 ఎంబీ డేటా: ఎయిర్‌సెల్ కొత్త డేటా ప్యాకేజీలు
కొత్తగా కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడికి మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులు అందించనున్నట్లు ప్రకటించింది. మూడు నెలల తర్వాత కూడా రూ.100కి పైగా రీచార్జి చేసుకున్న వారికి ఈ సర్వీసులు కొనసాగుతాయని సునీల్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications