న్యూఢిల్లీ: ఎవరేమనుకున్నా సరే, ఇప్పట్లో యునైటెట్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్) కంపెనీ ఛైర్మన్, డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకోవడం లేదని, 60 ఏళ్లు వయస్సు వచ్చాక రిటైర్మంట్ గురించి ఆలోచిస్తానని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. మంగళవారం నాడు బెంగుళూరులో జరిగిన యుఎస్‌ఎల్ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
అనంతరం విజయ్ మాల్యా విలేకరులతో మాట్లాడుతూ రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ' ఇప్పడే రిటైర్మెంట్ చేయాలనుకోవడం లేదు. అయితే గతంలో చెప్పినట్లే 60 ఏళ్లు వచ్చాక, దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తా, జీవితాన్ని ఆస్వాదించడం తెలిస్తే, ఎప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తాం, అందులో తప్పులేదు' అని పేర్కొన్నారు.

60 తర్వాతే ఆలోచిస్తా: రిటైర్మెంట్‌పై మాల్యా
'1955 డిసెంబర్ 18న పుట్టిన నేను, వచ్చే నెల 18కి 60 ఏళ్లకు చేరుకుంటానని అందరూ గుర్తు చేస్తున్నారు. 60 ఏళ్లు వచ్చినప్పుడు, రిటైర్మెంట్ గురించి ఆలోచించడం సహజం. మీరెన్ని రకాలుగు ప్రశ్నలు వేసినా ఇదే నా సమాధానం' అని బదులిచ్చారు.

60 తర్వాతే ఆలోచిస్తా: రిటైర్మెంట్‌పై మాల్యా
గతేడాది యునైటెట్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్)ను డియాజియో గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యుఎస్‌ఎల్ ఛైర్మన్‌గా మాల్యానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆ కంపెనీకి చెందిన నిధులను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఇతర యుబి గ్రూపు కంపెనీలకు దారి మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి.

60 తర్వాతే ఆలోచిస్తా: రిటైర్మెంట్‌పై మాల్యా
దాంతో మాల్యా యునైటెట్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్) చైర్మన్, డైరెక్టర్ పదవులు నుంచి తప్పుకోవాలని యుఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటా సంపాదించిన డియాజియో సంస్థ గతంలో కోరింది. ఆ ప్రసక్తే లేదని ప్రకటించిన మాల్యా మంగళవారం విలేకరులతో మరోసారి ఆ విషయాన్ని చెప్పారు.

60 తర్వాతే ఆలోచిస్తా: రిటైర్మెంట్‌పై మాల్యా
యునైటెట్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్)లో వాటా తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారా అనే ప్రశ్నకు గాను కింగ్‌ఫిషర్‌కు సంబంధించిన బ్యాంకు వ్యవహారాలను పరిష్కరించుకునే యత్నాల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications