ముంబై: ప్రముఖ దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ 'మ్యూచువల్ ఫండ్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్' పేరిట ఓ సరికొత్త ఓపెన్ ఎండెడ్ బ్యాలెన్స్‌డ్ స్కీమును ప్రవేశపెట్టింది. ఈ స్కీము ద్వారా రూ. 700 కోట్ల రూపాయలు సమీకరించాలని యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించుకుంది.
ఈ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ నవంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 2న ముగుస్తుందని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ చంద్రేశ్ కుమార్ నిగమ్ పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల చదువు, పెళ్లిళ్లు చేసేందుకే ఎంతో కష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఫండ్‌లో యూనిట్ల కేటాయింపు అనంతరం దీన్ని నిరంతర పెట్టుబడులకు డిసెంబర్ 14లోగా తిరిగి తెరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధుల్లో 40 నుంచి 60 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి మిగతా మొత్తాన్ని డెట్, ఇతర ఉపకరణాల్లో పెడతామన్నారు.
మ్యూచువల్ ఫండ్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్‌లో రెండు ప్లాన్లు ఉంటాయన్నారు. ఒకటి డైరెక్ట్ ప్లాన్ కాగా, రెండోది రెగ్యులర్ ప్లాన్ అన్నారు. వీటికి అనుబంధంగా రెండేసి సబ్‌ప్లాన్లు (కంపల్సరీ లాకిన్, నో లాకిన్) కూడా ఉంటాయన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications