న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డుపై సుంకం విధించడంతో శాశ్వత ఖాతా నంబర్ (పాన్‌కార్డు) పొందేందుకు చెల్లించాల్సిన రుసుము రూ. 107కు చేరుకుంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు నిధులు సేకరించేందుకు కేంద్రం అందించే పలు సేవలపై సుంకం విధించింది.
కాగా విదేశాల్లో ఉన్న వ్యక్తి పాన్ కార్డు పొందేందుకు చెల్లించాల్సిన మొత్తం చార్జీ రూ. 985 నుంచి రూ. 989కు పెరిగింది. భారత్‌లో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించాలంటే మనదేశంలో పాన్ కార్డు తప్పనిసరి.
ఆదాయం పన్ను(ఐటీ) శాఖ ఈ పాన్‌కార్డులను జారీ చేస్తుంది. సాధారణంగా అడ్రస్ మారినా, పాన్ కార్డు పోయినా లేదా పాన్ కార్డుపై ఫోటోను మార్చాలన్నా కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే.
అలాంటి పాన్ కార్డుని ఆన్‌లైన్‌లో పొందడం ఎలా?
కింద పేర్కొన్న లింక్ ద్వారా ఫారం 49Aని డౌన్ చేసుకోని ఫోటోతో సహా అన్ని వివరాలను నింపాల్సి ఉంది. అనంతరం కొత్త పాన్ కార్డ్ జారీ కోసం 93 రూపాయల పైన సర్వీసు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త పాన్ కార్డు ఫారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాన్ కార్డు ఫారం నింపేందుకు పూర్తి గైడ్‌లెన్స్
పాన్ కార్డ్ అంటే ఏమిటీ..
మనం సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితిలో ఉంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ అనేది అవసరం. కారణం మీ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మీ పాన్ కార్డ్ నెంబర్‌ను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నెంబర్. మన పాన్ కార్డ్ అనేది పది డిజిట్లలో ఉంటుంది. ఆల్పా న్యూమరిక్ నెంబర్లను కలిగి ఉన్న ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందజేస్తుంది. దీనినే పాన్ కార్డ్ అంటారు.

ఈ కార్డుపై మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. వ్యక్తిగత వివరాలు అంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన రోజు, పాన్ నెంబర్‌తో పాటు మీ సంతకం మరియు మీ ఫోటో ఉంటుంది. పాన్ కార్డ్ పై గల పది ఆల్ఫా న్యూమరిక్ రూపంలో ఉండే అక్షరాలలో మొదటి ఐదు అక్షరాలు ఆంగ్ల అక్షరాలు, తర్వాత నాలుగు అక్షరాలు సంఖ్యలు మరియు చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది. ఈ పది అక్షరాలను ఐదు భాగాలుగా విభజించడమైనది.
* మొదటి మూడు అక్షరాలుగా AAA to ZZZ ఉంటాయి.
* నాలుగవ అక్షరం పాన్ కార్డ్ హోల్దర్ యొక్క స్థితిని తెలియచేస్తుంది.
• C - Company • P - Person
• H - HUF(Hindu Undivided Family)
• F - Firm
• A - Association of Persons (AOP)
• T - AOP (Trust)
• B - Body of Individuals (BOI)
• L - Local Authority
• J - Artificial Juridical Person
• G - Government
* ఐదవ అక్షరం పాన్ కార్డ్ హోల్దర్ ఇంటి పేరు లోని మొదటి అక్షరంను తెలియచేస్తుంది.
* తర్వాత నాలుగు అక్షరాలు అంకెలలో 0001 నుండి 9999 వరకు ఉంటాయి.
* చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications