బీహార్ ఎఫెక్ట్!: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు సోమవారం స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన సెన్సెక్స్ 550కి పైగా పాయింట్లు నష్టపోయింది.
ఇక నిఫ్టీ సైతం 150కి పైగా పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. రూపాయి విలువ కూడా భారీగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 62 పైసలు తగ్గింది. కాగా ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 26,265 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నిప్టీ 7,954 వద్ద ట్రేడ్ అవుతుంది.

బీహార్ లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఐదు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధికంగా 56.8 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో మొత్తం 3450 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆదివారం ఓట్ల లెక్కింపులో మహా కూటమి 178 స్థానాల్లో విజయం సాధించగా, ఎన్డీఏకు 58 స్థానాలు మాత్రమే దక్కాయి.
14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. ఎన్నికల ఫలితాల వివరాలు పార్టీల వారీగా చూస్తే
జేడీయూ- 71, ఆర్జేడీ-80, కాంగ్రెస్-27, బీజేపీ-53, ఎల్జేపీ -2, ఆర్ఎల్ఎస్పీ-2, హెచ్ఏఎం- 1, ఇతరులు-7.


Click it and Unblock the Notifications