చైనాకు సంబంధించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో విక్రయించే వస్తువుల్లో దాదాపు 40 శాతం నాణ్యత లేని వస్తువులే అని ఓ సర్వేలో తేలింది. స్యయంగా ఆ దేశానికి ఓ సంస్ధ సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
ఆన్‌లైన్ వినియోగదారుల హక్కుల పరిరక్షణపై సమర్పించిన ఈ నివేదిక ప్రకారం గతేడాది వాణిజ్య విభాగ అధికారులు మొత్తం 77,800 కంప్లైంట్స్‌ను అందుకున్నారు. ఈ ఫిర్యాదులు 356.6 శాతం పెరిగాయి.
చైనాలో టాప్ లీడర్స్‌లో ఒకరైన జాంగ్ డెజింగ్ అధ్యక్షతన జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ప్లీనరీ సమావేశంలో ఆన్‌లైన్ ట్రేడ్‌ను మరింత కఠినతరం చేయాలని కోరింది. గతేడాది 442 బిలియన్ డాలర్ల మేరక ఆన్‌లైన్ వ్యాపారం చేసి చైనా అగ్రస్థానంలో నిలిచింది.

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే
అమెరికా కేవలం 300 బిలియన్ డాలర్ల మేరకు మాత్రమే ఆన్‌లైన్ వ్యాపారం చేసింది. ప్రతి ఏటా చైనాలో ఆన్‌లైన్ వ్యాపారం 40 శాతం పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపారంలోకి నకిలీలు భారీ స్ధాయిలో పెరిగారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే
కొన్నేళ్లుగా చైనా జీడీపీ అభివృద్ధిలో ఇంటర్నెట్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపారంలో జరుగుతున్న మోసాల్ని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ నివేదికలో సంస్ధ పేర్కొంది.

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే
దీనిపై ఆలీబాబా అధినేత జాక్ మా మాట్లాడుతూ తమ సంస్థ సప్లయిర్స్‌ను అత్యంత జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేస్తోందని తెలిపారు. చైనా ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లెక్కల ప్రకారం చైనాలో 328 ఆన్‌లైన్ వెబ్ సైట్లు ఉన్నాయి.

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే
చైనా మార్కెట్ మూలధనంలో వీటి వాటా 25.6 శాతం ఉంది. ఆలీ బాబాతో పాటు మూడు కంపెనీలు ప్రపంచంలోనే 10 ఆన్‌లైన్ వెబ్ సైట్లుగా వెలుగొందుతున్నాయి. కాగా చైనాలో 361 మిలియన్ జనాభా తమ షాపింగ్‌ను ఆన్‌లైన్‌లోనే చేస్తుండటం విశేషం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications