గొప్ప దార్శనికుడు: ముంజాల్‌కు కార్పోరేట్ ఘన నివాళి
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, హీరోమోటోకార్ప్ గ్రూపునకు చెందిన బ్రిబ్‌మోహన్‌లాల్ ముంజాల్ మృతిపై పారిశ్రామిక వర్గాలు ప్రగాఢ సంతాపం తెలిపాయి. ఆయన ఓ గొప్ప దార్శినికుడని కొనియాడారు. ఆయన మృతి దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నాయి.
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముంజాల్, ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. ముంజాల్‌కు దేశీయ ద్విచక్ర వాహన రంగ ఆద్యుడిగా పేరుంది. దేశీయ ఆటో పరిశ్రమ అంతర్జాతీయంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర పోషించారు.
ఆయన దేశీయ పారిశ్రామిక రంగ ఆద్యుల్లో ముంజాల్ ఒకరని, ఆయన మరణంతో ఇండస్ట్రీలో పూడ్చలేని అగాధం ఏర్పడిందని భారత పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ అన్నారు. ఆయనను కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటని అసోచామ్ పేర్కొంది.
ముంజాల్ మృతితో దేశీయ వాహన రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) ప్రెసిడెంట్ వినోద్ దాసరి అన్నారు. ఆయన మృతిపై పారిశ్రామికవేత్తలు, ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, వాణిజ్య మంత్రి నిర్మల సీతారామన్‌లతో పాటు పలువురు తీవ్రసంతాపం వ్యక్తం చేశారు.

గొప్ప దార్శనికుడు: ముంజాల్‌కు కార్పోరేట్ ఘన నివాళి
ముంజాల్ గొప్ప దార్శనికుడని, అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో భారత్ స్థానాన్ని పటిష్ఠ పరచడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో తన వ్యాపారాన్ని ముంజాల్ హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లారని, భాగస్వామ్యాలకు ఆయన పెట్టింది పేరని పిహెచ్‌డి చాంబర్ ప్రెసిడెంట్ అలోక్ బి శ్రీరామ్ అన్నారు.

గొప్ప దార్శనికుడు: ముంజాల్‌కు కార్పోరేట్ ఘన నివాళి
1923 సంవత్సరంలో ముంజాల్... కమాలియాలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్‌లో ఉంది. 1940 సంవత్సరంలో నలుగురు ముంజాల్ సోదరులు సైకిళ్ల తయారీని ప్రారంభించారు. 1956 నుంచి హీరో గ్రూప్ అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

గొప్ప దార్శనికుడు: ముంజాల్‌కు కార్పోరేట్ ఘన నివాళి
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముంజాల్ సోదరులు లూధియానా కేంద్రంగా సైకిళ్ల విడిభాగాలు తయారు చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత హీరో గ్రూప్ అంచెలంచెలుగా ఎదగడం మొదలైంది. 1984 సంవత్సరంలో జపాన్‌కు చెందిన హోండా కంపెనీతో హీరో గ్రూప్ ద్విచక్ర వాహనాల కోసం జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.

గొప్ప దార్శనికుడు: ముంజాల్‌కు కార్పోరేట్ ఘన నివాళి
హీరో హోండా పేరుతో మోటార్ సైకిళ్ల తయారీలో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ఎదిగింది. 2011 సంవత్సరంలో ఈ రెండు కంపెనీలు విడిపోయాయి. ముంజాల్ చేసిన కృషికి గుర్తింపుగా 2005 సంవత్సరంలోనే పద్మభూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. సైకిళ్లలోనూ, మోటార్ సైకిళ్లలోనూ హీరో బ్రాండ్‌ను ఇంటింటి పేరుగా మార్చిన ఘనత ఆయనది.


Click it and Unblock the Notifications