ముంబై: స్పైస్‌జెట్ సీఓఓ పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే సంజీవ్ కపూర్‌ని మరో అద్భుతమైన ఆఫర్ వరించింది. టాటా గ్రూప్-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తారాలో ఛీఫ్ స్ట్రాటజీ & కమర్షియల్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
అయితే ఈ నియామకం ఫిబ్రవరి 2016 నుంచి అమల్లోకి వస్తుందని శుక్రవారం విస్తారా ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసియా, యూరప్, అమెరికాలకు చెందిన విమానయాన సంస్ధలతో వివిధ హోదాల్లో విమానయాన రంగంలో సంజీవ్ కపూర్‌కు 19 ఏళ్ల అనుభవం ఉంది.

స్పైస్‌జెట్ మాజీ సీఓఓను వరించిన అద్భుత ఆఫర్
అమెరికాలోని డార్ట్‌మౌత్ కాలేజీలో గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించిన సంజీవ్ కపూర్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిలేనియా పరిధిలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. నార్త్‌వెస్ట్ ఎయిర్ లైన్స్, బెయిన్ అండ్ కంపెనీ, తీమాసెక్ హోల్డింగ్స్ (సింగపూర్), బీసీజీ లాంటి ప్రఖ్యాత కంపెనీల్లో గతంలో పనిచేశారు.

స్పైస్‌జెట్ మాజీ సీఓఓను వరించిన అద్భుత ఆఫర్
స్పైస్‌జెట్ సీఓఓ పదవికి సంజీవ్ కపూర్ గురువారం రాజీనామా చేశారు. సంజీవ్ కపూర్ రాజీనామా ఈనెల 30వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పైస్‌జెట్ తెలిపింది. 2013 నవంబర్‌లో స్పైస్ జెట్ సీఓఓగా సంజీవ్ కపూర్‌ను అప్పటి కంపెనీ యజమాని కళానిధి మారన్ నియమించారు.

స్పైస్‌జెట్ మాజీ సీఓఓను వరించిన అద్భుత ఆఫర్
స్పైస్‌జెట్ ఫ్లాష్ సేల్స్, రాయితీ టికెట్ల ఆఫర్లను అందించడంలో 48 ఏళ్ల సంజీవ్ కీలకపాత్ర పోషించారు. ఒప్పందం ప్రకారం కంపెనీ సీఓఓగా ఇంకో ఏడాది పదవీకాలం ఉన్నప్పటికీ, సంజీవ్ కపూర్ ముందే రాజీనామా చేశారు.

స్పైస్‌జెట్ మాజీ సీఓఓను వరించిన అద్భుత ఆఫర్
స్పైస్‌జెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కళానిధి మారన్ నుంచి 58.46 శాతం వాటాను అజయ్ సింగ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications