బెంగుళూరు: వినూత్న ఆలోచనలతో పుట్టుకొస్తున్న కొత్త స్టార్టప్ కంపెనీల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంటే, వాటిల్లో అత్యధిక కంపెనీలు విజయానికి ఆమడ దూరంలో ఉంటే, కేవలం 10 శాతం కంపెనీలు మాత్రమే ముందడుగు వేస్తున్నాయని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు.
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి, మరిన్ని కంపెనీలు విజయం సాధించేలా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూల వాతావరణం కల్పించాలని ఆయన కోరారు. గత మూడు నాలుగేళ్లలో ప్రారంభమైన కంపెనీల్లో 10 శాతం లాభాల్లో ఉండగా, 25 శాతం కంపెనీలు పెట్టుబడులను తిరిగి తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.

స్టార్టప్ కంపెనీల్లో 10 శాతం మాత్రమే విజయం: ఇన్ఫీ మాజీ డైరెక్టర్
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన 'డిజిటల్ ఇండియా' ప్రచారం మరో అడుగు ముందుకేస్తే, వచ్చే పదేళ్లలో లక్ష కొత్త కంపెనీలు ఇండియాకు వస్తాయని, వీటి ద్వారా 35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వీటి విలువ 500 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 లక్షల కోట్లు) ఉంటుందని మోహన్ దాస్ అంచనా వేశారు.

స్టార్టప్ కంపెనీల్లో 10 శాతం మాత్రమే విజయం: ఇన్ఫీ మాజీ డైరెక్టర్
ప్రధాని మోడీ ఆలోచలను సరైన దిశలో నడిపిస్తే, భారత్‌లో సాంకేతికంగా పెను మార్పులను సంతరించుకుంటుందని తెలిపారు. భారతీయులు అందరూ వైర్ లెస్ పరికరాల ద్వారా కనెక్ట్ కావాల్సి వుందని, ఆరవ తరగతి నుంచి అందరు విద్యార్థులు 3జీతో కూడిన ఇంటర్నెట్ ద్వారా ట్యాబ్ లను వాడాలని ఆయన అభిలషించారు.

స్టార్టప్ కంపెనీల్లో 10 శాతం మాత్రమే విజయం: ఇన్ఫీ మాజీ డైరెక్టర్
అది సాధ్యమైతేనే తదుపరి 15 సంవత్సరాల్లో ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం ఇండియాలో 18 వేల స్టార్టప్ సంస్థలు 3 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని తెలిపారు.

స్టార్టప్ కంపెనీల్లో 10 శాతం మాత్రమే విజయం: ఇన్ఫీ మాజీ డైరెక్టర్
స్టార్టప్ కంపెనీలు విఫలమైనా, యజమానులకు రక్షణ కల్పించేలా దివాలా చట్టానికి సవరణలు చేయాలని, అప్పుడే మరిన్ని వినూత్న ఆలోచనలతో కొత్త కంపెనీలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications