దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో సంస్ధను టేకోవర్ చేసింది. అమెరికాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెన్సీ సర్వీసులు అందిస్తున్న నోహా కన్సల్టింగ్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ 7 కోట్ల డాలర్లు (రూ. 453 కోట్లు).
పూర్తిగా నగదు రూపంలోనే ఈ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి అధునాతన సమాచార నిర్వహణ సేవలను నోహా కన్సల్టింగ్ అందిస్తోంది. ప్రస్తుత త్రైమాసికం ముగిసేనాటికి పూర్తికాగలదని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి చెందిన కంపెనీలకు డేటా నిర్వహణ సేవలను అందించే విషయంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తాజా కొనుగోలు దోహదం చేస్తుందని ఇన్ఫోసిస్ ఈవీపీ, గ్లోబల్ హెడ్ రాజేష్ మూర్తి ఈ సందర్భంగా తెలిపారు.

ఇన్ఫీ చేతికి నోవా కన్సల్టింగ్: ఒప్పందం విలువ 453 కోట్లు
ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి తర్వాతి తరం డేటా అనలిటిక్స్ సొల్యూషన్లను అందించాలన్న వ్యూహంలో భాగంగానే ఈ కొనుగోలును చేసినట్లు ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే లోపు నోవా కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

ఇన్ఫీ చేతికి నోవా కన్సల్టింగ్: ఒప్పందం విలువ 453 కోట్లు
ఇదిలా ఉంటే.. చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఇలాంటి తరుణంలో కంపెనీలు తమ పెట్టుబడులపై రిటర్నులను సాధించేందుకు తగిన మార్గాలను అన్వేషించాల్సి వస్తోందన్నారు.

ఇన్ఫీ చేతికి నోవా కన్సల్టింగ్: ఒప్పందం విలువ 453 కోట్లు
కంపెనీలు అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు తమ సామర్థ్యాలను పెంచుకునేం దుకు అవసరమైన డేటా మేనేజ్‌మెంట్ స్ర్టాటజీ తదితర సమాచార అవసరం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ కంపెనీలకు తమ సంస్థ పూ ర్తి స్థాయిలో డేటా మేనేజ్‌మెంట్ సర్వీసులు అందించేందుకు నోవా కన్సల్టింగ్ కొనుగోలు దోహదపడుతుందన్నారు.

ఇన్ఫీ చేతికి నోవా కన్సల్టింగ్: ఒప్పందం విలువ 453 కోట్లు
నోవా, ఇన్ఫోసిస్ మూలంగా తమ క్లయింట్లకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని నోవా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ జాన్ రూడి తెలిపారు. ఉమ్మడిగా ఆయిల్, గ్యాస్ కంపెనీల సామర్థ్యాలను పెంపొందించేందుకు దోహదపడనున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications