మార్చి నాటికి ఆన్‌లైన్ లోనే పీఎఫ్ విత్ డ్రా
ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఆన్‌లైన్‌లో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నగదుని విత్‌డ్రా చేసుకునే సౌకర్యం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ వెల్లడించారు. ప్రావిడెంట్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డ్‌ను స్వచ్ఛందంగా అమలుచేయడానికి గడువును సుప్రీంకోర్టు మార్చి వరకూ పొడిగించిన నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ తాజా ప్రకటన వెలువడింది.

మార్చి నాటికి ఆన్‌లైన్ లోనే పీఎఫ్ విత్ డ్రా
ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ వెల్లడించారు.

మార్చి నాటికి ఆన్‌లైన్ లోనే పీఎఫ్ విత్ డ్రా
ప్రావిడెంట్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డ్‌ను స్వచ్ఛందంగా అమలుచేయడానికి గడువును సుప్రీంకోర్టు మార్చి వరకూ పొడిగించిన నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ తాజా ప్రకటన వెలువడింది. పీఎఫ్ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానించడం ద్వారా దరఖాస్తు అందిన మూడు గంటల్లోనే పీఎఫ్ క్లెయిమ్ పరిష్కారమయ్యేలా అమల్లోకి రానున్న తాజా చర్య దోహదపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మార్చి నాటికి ఆన్‌లైన్ లోనే పీఎఫ్ విత్ డ్రా
ప్రస్తుతం పీఎఫ్ ఖాతాదారులు తమ నగదుని పొందేందుకు పరిష్కార సమయం 20 రోజులుగా ఉంది. కాగా, ఈపీఎఫ్‌ఓకు ప్రస్తుతం 5 కోట్ల మందికిపైగా చందాదారులు ఉన్నారు.

మార్చి నాటికి ఆన్‌లైన్ లోనే పీఎఫ్ విత్ డ్రా
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 5.6 కోట్ల UAN నెంబర్లను జారీ చేసింది. అందులో 92.88 లక్షల మంది చందాదారులు ఆధార్ నెంబర్లను ఇవ్వగా, 2.75 కోట్ల మంది చందాదారులు బ్యాంక్ డిటేల్స్‌ను కూడా ఇచ్చారు.


Click it and Unblock the Notifications