ఇన్ఫోసిస్‌లో 2 వేల మందికి పైగా ప్రమోషన్లు
దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ ఇన్ఫోసిస్‌లో 2,067 వేల మందికి ప్రమోషన్లు లభించాయి. ఉద్యోగంలో మంచి పనితీరు కనబర్చడంతో పాటు కంపెనీ పురోగతికి తమ వంతు కృషి అందించిన వారందరికీ ప్రమోషన్లు ఇచ్చామని సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింది.
కంపెనీ రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసిన నేపథ్యంలో ఉద్యోగులు వేతనాలు సైతం 80 నుంచి 100 శాతం వరకూ పెంచామని పేర్కొంది. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నెల ముగిసేనాటికి 4,711 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్టు కంపెనీ అధికారప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇన్ఫోసిస్‌లో 2 వేల మందికి పైగా ప్రమోషన్లు
కాగా, ఇన్ఫోసిస్‌లో ఈ మధ్య కాలంలో పెరుగుతున్న అట్రిషన్ రేటును అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగానే ప్రమోషన్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నుంచి 14.1 శాతం మంది రాజీనామాలు చేసి వెళ్లగా మొత్తం మీద చూస్తే ఈ రేటు 19.9 శాతంగా ఉంది.

ఇన్ఫోసిస్‌లో 2 వేల మందికి పైగా ప్రమోషన్లు
దీంతో అనుభవజ్ఞులైన నిపుణులను వదులుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. రెండో త్రైమాసికంలో రూ.3,398 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇన్ఫోసిస్‌లో 2 వేల మందికి పైగా ప్రమోషన్లు
ప్రధానంగా పటిష్టమైన ఆదాయ వృద్ధి, నిర్వహణ పనితీరు క్యూ2లో కంపెనీ మెరుగైన రాబడులకు దోహదం చేసిందని ఇన్ఫోసిస్ సీఓఓ యుబి ప్రవీణ్ రావు అన్నారు. కాగా, డాలర్ రూపంలో సెప్టెంబర్ క్వార్టర్‌కు ఇన్ఫీ ఆదాయం 6 శాతం ఎగబాకి 2.392 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

ఇన్ఫోసిస్‌లో 2 వేల మందికి పైగా ప్రమోషన్లు
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) రాజీవ్ బన్సల్ రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రకటించింది. కాగా సాప్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో, (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బన్సాల్ తన పదవికి రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.


Click it and Unblock the Notifications