బ్యాంకింగ్ వర్గాల్లో సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మనీ లాండరింగ్ కుంభకోణంలో ఆరుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. ఢిల్లీలోని అశోక్ విహార్‌లో గల బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో రూ. 6,000 వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
వీరిలో నలుగురిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయగా, మరో ఇద్దరిని సీబీఐ మంగళవారం అదుపులోకి తీసుకుంది. అరెస్టయి వారిలో బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఫారెక్స్ విభాగం అధిపతులు ఉన్నారు. వీరితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగి కూడా ఉన్నారు.
బ్యాంకు ఎజిఎం ఎస్‌కె గార్గ్, ఫారెక్స్ చీఫ్ అధిపతి జైనిష్ దూబేను అవినీతి నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు సీబీఐ పేర్కొంది. గతవారం వీరి గృహాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. దీంతో ఈ కుంభకోణంలో వీరి పాత్ర బహిర్గమైంది.
బ్యాంకులోని 59 మంది కరెంట్ అకౌంట్ హోల్డర్లు, పలువురు బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై విదేశాలకు అక్రమ చెల్లింపులు, కస్టమ్స్ డ్యూటీల ఎగవేతకు పాల్పడి సుమారు 6 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని సీబీఐ తన చార్జి షీటులో పేర్కొంది.
బ్యాంకు అధికారులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ లక్ష డాలర్ల లోపు మొత్తాలుగా విడగొట్టి వివిధ అకౌంట్లలో చెల్లించడం ద్వారా ఆటోమేటిక్ గుర్తింపు సాఫ్ట్‌వేర్ దృష్టి నుంచి తప్పించుకున్నారని సీబీఐ అందులో పేర్కొంది. 2014-15 మధ్య ఇలాంటి లావాదేవీలు సుమారు 8 వేల వరకు జరిగినట్లు సీబీఐ తెలిపింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా స్కామ్: అసలేం జరిగింది
బ్యాంక్ ఆఫ్ బరోడా మనీ లాండరింగ్ కుంభకోణంలో మొత్తం 59 నకిలీ కంపెనీలకు భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఈ కుంభకోణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా జరిగే లావాదేవీకి డాలరుకు 30- 50 పైసలు కమీషన్ తీసుకొని హెచ్ డీఎఫ్‌సీ ఉద్యోగి సాయం చేసినట్లు ఈడీ వెల్లడించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా స్కామ్: అసలేం జరిగింది
వీరిలో భాటియా నకిలీ కంపెనీలను సృష్టించడంలో కీలకమని, ధావన్ రెడీమేడ్ దుస్తుల ఎగుమతిదారని తెలిపింది. వీరు అగర్వాల్‌తో కలిసి అశోక్ విహార్‌లోని బిఒబి బ్రాంచ్ ద్వారా 430 కోట్ల రూపాయల విలువైన విదేశీ చెల్లింపులను అతితక్కువ కాలంలో మాయం చేసారని తెలిపింది. దీనికి తోడు ధావన్ 6-7 నెలల కాలంలో 15 కోట్ల రూపాయల కస్టమ్స్ డ్యూటీని డ్రా బ్యాక్ చేసినట్లు తెలిపింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా స్కామ్: అసలేం జరిగింది
బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెలుగు చూసిన కుంభకోణంపై దర్యాప్తు జరిపిస్తామని కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ జయ కుమార్ ప్రకటించారు. సీఈఓ, బ్యాంకు ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతిని తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని, ఉద్యోగులందరితో కలిసి పని చేస్తూ దీనికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తానన్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా స్కామ్: అసలేం జరిగింది
వారం రోజుల్లో పూర్తి వివరాలను ఆడిట్ కమిటీకి నివేదిస్తానని, 90 రోజుల్లోగా బ్యాంకు భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. బ్యాంకులో వ్యవస్థాపరంగా తగు మార్పులు చేసి భవిష్యత్తులో ఇలాంటి కుంభకోణాలు జరగడాన్ని నిరోధించే విధంగా ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications