న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సర్వీసుల సంస్థ ఐగేట్ కంపెనీ సీఈఓ పదవికి అశోక్ వేమూరి రాజీనామా చేశారు. ఐగేట్ కంపెనీని 4 బిలియన్ డాలర్లకు ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని ఈ ఏడాది జూలై 1న కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
వ్యక్తిగత కారణాల వల్లనే పదవికి రాజీనామా చేసినట్లు, దీంట్లో ఎవరి ఒత్తిడి లేదని క్యాప్‌జెమినీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐగేట్ వ్యాపార వృద్ధిలో అశోక్ కీలక పాత్ర పోషించారని, పరస్పర అంగీకారంతోనే ఆయన వైదొలిగినట్లు సంస్థ వెల్లడించింది.

ఐగేట్ సీఈఓ పదవికి అశోక్ వేమూరి రాజీనామా
కాగా క్యాప్‌జెమిని, ఐగేట్ విలీనంతో అశోక్ వేమూరి సంపద విలువ దాదాపు రూ.120 కోట్ల మేర పెరిగింది. ఐగేట్‌ను టేకోవర్ చేయనున్నట్లు ప్రకటించిన క్యాప్ జెమిని, ఒక్కో ఐగేట్ షేరుకు 48 డాలర్లను వెచ్చించించినట్లు ప్రకటించింది.

ఐగేట్ సీఈఓ పదవికి అశోక్ వేమూరి రాజీనామా
ప్రస్తుతం అశోక్ వేమూరి వద్ద 4 లక్షల మేర ఐగేట్ షేర్లున్నాయి. ఈ షేర్లకు క్యాప్ జెమినీ 1.9 కోట్ల డాలర్ల(రూ.120 కోట్లు)ను చెల్లించిందని సమాచారం. అశోక్ వేమూరి గతంలో ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.
ఐగేట్ సీఈఓ పదవికి అశోక్ వేమూరి రాజీనామా
ఇన్ఫోసిస్ అమెరికా ఆపరేషన్స్ కు అధినేతగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన 2013, సెప్టెంబర్‌లో ఐగేట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఐగేట్, క్యాప్‌జెమిని విలీన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు.

ఐగేట్ సీఈఓ పదవికి అశోక్ వేమూరి రాజీనామా
క్యాప్‌జెమినీలో విలీనమైన నాటి నుంచి అశోక్ వేమూరి ఐగేట్ నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలు వచ్చాయి. చివరకు అవి నిజమయ్యాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications