జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్: టిక్కెట్లపై 30శాతం తగ్గింపు

న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ఎయిర్‌వేస్ బిజినెస్, ఎకానమీ క్లాస్ టికెట్ ధరలను 30 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

అక్టోబర్ 10వ తేదీ వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ అమెరికా, యూరప్ దేశాలతోపాటు గల్ఫ్, ఐరోపా, కెనడా, సార్క్ దేశాలకు వెళ్లేవారికి కూడా వర్తించనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Jet Airways cuts fares by up to 30% on overseas routes

ఇతర విమానయాన సంస్థలతో పోలిస్తే అంతర్జాతీయ మార్గాల్లో తక్కువ ధరకే టికెట్‌ను విక్రయిస్తున్నప్పటికీ, వచ్చే పండుగ సీజన్‌లో భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారికి మరింత ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు జెట్ ఎయిర్‌వేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌరంగ్ శెట్టి తెలిపారు.

ఈ ఆఫర్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానాలకు కూడా వర్తించనుందని తెలిపారు. ప్రస్తుతం 73 అంతర్జాతీయ, దేశీయ గమ్యస్థానాలకు జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులను నడుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+