హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ వేర్‌హౌస్‌: బిగ్ బిలియన్ డేస్‌‌కు అంతా సిద్ధం

హైదరాబాద్: దేశీయ అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన భారీ వేర్‌హౌస్‌‌ను హైదరాబాద్‌కు సమీపంలో ఏర్పాటు చేస్తోంది. కంపెనీకి ఇది 16వ వేర్‌హౌస్ కాగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది. దాదాపు 2.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మహబూబ్‌నగర్ జిల్లాలో దీనిని నిర్మించనుంది.

నిర్మాణం పూర్తి అయితే రోజుకు 1.2 లక్షల వస్తువులను వేర్‌హౌస్ నుంచి సరఫరా చేసేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ వేర్‌హౌస్‌ని అక్టోబర్‌ నెలలోనే ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా 16 వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు రూ.400 కోట్లు వెచ్చించింది.

2020 నాటికి మరో 50 నుంచి 100 వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేయాలన్నది ఫ్లిప్‌కార్ట్ ఆలోచన. ఇందుకు రూ.3 వేల కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ వేర్‌హౌస్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కలగనుందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి తెలిపారు.

హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ వేర్‌హౌస్‌

హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ వేర్‌హౌస్‌

ఈ సందర్భంగా అంకిత్ మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లిప్‌కార్ట్‌తో 3,000 మంది విక్రయదారులు చేతులు కలిపారన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఫ్లిప్‌కార్ట్‌కు 5 లక్షల మంది కస్టమర్లు ఉన్నారన్నారు.

హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ వేర్‌హౌస్‌

హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ వేర్‌హౌస్‌

ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారుల సంఖ్య ప్రతి నెలా 8 శాతం పెరుగుతోందన్నారు. కొనుగోళ్లలో హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి ముందంజలో ఉన్నాయని తెలిపారు. ఇక విభాగాల వారీగా చూస్తే హోం, మొబైల్, స్పోర్ట్స్, ఫిట్‌నెస్, పర్సనల్ కేర్ వరుసగా నిలిచాయన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులైన యువత అధికంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారన్నారు.

 హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ వేర్‌హౌస్‌

హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ వేర్‌హౌస్‌

అక్టోబర్ 13 నుంచి 17 వరకు బిగ్ బిలియన్ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 70 విభాగాల్లో 3 కోట్లకుపైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 40 వేల మంది విక్రయదారులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. బిగ్ బిలియన్ డేస్‌ కోసం దేశవ్యాప్తంగా 19 వేల మంది డెలివరీ బాయ్స్ సిద్ధంగా ఉన్నారని కంపెనీ తెలిపింది.

హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ వేర్‌హౌస్‌

హైద్రాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ వేర్‌హౌస్‌

ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుక్కునే వినియోగదార్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇందులో తమ కస్టమర్లు 4.5 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. 75 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డరు చేస్తున్నారని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+