ముంబై: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీరేట్లను 0.35 శాతం తగ్గించినట్లు ప్రకటించింది. దాంతో బ్యాంక్ బేస్‌రేటు 9.70 శాతం నుంచి 9.35 శాతానికి చేరుకుంది. ఫలితంగా ఐసీఐసీఐ బ్యాంక్ గృహ, వాహన రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి.
తగ్గించిన వడ్డీరేట్లు అక్టోబర్ 5 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది. జూలై 1, 2010 తర్వాత తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే కోటి రూపాయలకు పైగా డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటులో పావు శాతం కోతను విధించింది.

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)
వడ్డీరేట్లను తగ్గించిన జాబితాలోకి ఐసీఐసీతోపాటు మరో 7 బ్యాంకులు చేరాయి. ద్వైమాసిక సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీరేట్లను అరశాతం తగ్గించడంతో ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందిస్తున్నాయి. గురువారం వడ్డీరేట్లను తగిస్తున్నట్లు ప్రకటించినవాటిలో అలహాబాద్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), యెస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా, దేనా బ్యాంక్, కర్ణాటక బ్యాంకుతోపాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి.

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)
ప్రస్తుతం ఉన్న 9.75 శాతం వడ్డీరేటును 9.50 శాతానికి తగ్గిస్తున్నట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. వడ్డీరేటుని పావు శాతం తగ్గించడంతో యస్ బ్యాంక్ వడ్డీరేటు 10.25 శాతంగా ఉంది. ఎస్‌బీబీజే కూడా 0.25 శాతం తగ్గించడంతో బ్యాంక్ బేస్‌రేటు 9.70 శాతంగా నమోదైంది.

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)
దేనా బ్యాంక్ వడ్డీరేటు 9.70 శాతంగా నమోదైంది. దేనా బ్యాంకు మొత్తం రుణాల్లో 80 శాతం రు ణాలకు బేస్ రేటుతో సంబంధం ఉంటుందని, తాజాగా ఈ రేటును తగ్గించినందు వల్ల మార్జిన్లపై 0.2-0.25 శాతం ప్రభావం పడనుందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌కె తక్కర్ తెలిపారు.

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)
బేస్‌రేటును 9.95 శాతం నుంచి 9.50 శాతానికి తగ్గించినట్లు అలహాబాద్ బ్యాంక్ వెల్లడించింది. కర్ణాటక బ్యాంకు వడ్డీ రేటు పావు శాతం తగ్గి 10.25 శాతంగా ఉంది. బ్యాంకులు తగ్గించిన వడ్డీరేట్లు ఈ నెల 5 నుంచి అమలులోకి రానున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications