ముంబై: నాల్గవ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘరామ్ రాజన్ వెల్లడించారు. మంగళవారం జరిగిన ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వడ్డీ రేట్లను అరశాతం తగ్గించారు.
ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని దశలవారీగా చెల్లిస్తున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పావుశాతం మాత్రమే తగ్గుతాయని భావించిన పరిశ్రమ వర్గాలు ఈ నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్ వృద్ధిరేటు మెరుగు కోసమే వడ్డీరేటు అరశాతం తగ్గించామని రాజన్ ప్రకటించారు.
రెపో, రివర్స్ రెపో రేటును అరశాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్) నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దీంతో రెపో రేటు నాలుగేళ్ల కనిష్ఠస్థాయి 6.75శాతానికి చేరింది.

రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్‌బీఐ
దాంతో గృహ, వాహనాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, 2016 జనవరి నాటికి ద్రవ్యోల్భణం 5.8 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ చెప్పారు. 2015-16లో వృద్ధిరేటు అంచనాను 7.6శాతం నుంచి 7.4శాతానికి తగ్గించనిట్లు పేర్కొన్నారు.

రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్‌బీఐ
ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయని తాము ఆశిస్తున్నట్టు ఆర్బీఐ చీఫ్ రఘరామ రాజన్ పేర్కొన్నారు. 2018 మార్చి నాటికి ప్రభుత్వం బాండ్లతో ఎఫ్‌సీఐ పెట్టుబడి పరిమితిని దశలవారీగా 5 శాతానికి పెంచుతామని రాజన్ వెల్లడించారు. పలు కారణాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని పేర్కొన్నారు.

రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్‌బీఐ
రఘరామ్ రాజన్ స్వల్ప కాలిక రెపో రేటు తగ్గిస్తారా? లేదా? అని ప్రభుత్వం, పారిశ్రామిక రంగం వేయి కళ్లతో ఎదురు చూశాయి. పెద్దగా తగ్గించక పోయినా, కనీసం పావు శాతమైనా రెపో తగ్గించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు భావించాయి.

రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్‌బీఐ
అయితే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు డిసెంబర్‌లోగా వడ్డీ రేట్లు పెంచుతుందన్న వార్తలు, రుతు పవనాలు ముఖం చాటేయడంతో దేశంలో మళ్లీ ధరలు కొండెక్కే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో రెపో రేటు తగ్గించకుండా రాజన్ చేతులకు సంకెళ్లు వేస్తాయనే అంచనాలూ వినిపించాయి. కానీ, వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ రెపో, రివర్స్ రెపో రేటును అరశాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications