ఫోక్స్ వ్యాగన్ కంపెనీ తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయించిన 1.1 కోటి డీజిల్ కార్ల ఇంజన్ల నుంచి వెలువడే కాలుష్య కారక వాయువుల విడుదలను అమెరికా అధికార్లకు తగ్గించి చూపేందుకు వాటిలో ఒక సాఫ్ట్‌వేర్ అమర్చారనే విషయం ఇటీవల బయటపడటంతో కంపెనీ ప్రతిష్ఠ దిగజారింది.
అంతేకాదు కంపెనీ షేర్లు సైతం కుప్పకూలాయి. ప్రాంక్‌ఫర్డ్ స్టాక్ ఎక్సేంజీలో మంగళవారం ఫోక్స్ వ్యాగన్ షేర్లు 17 శాతం క్షీణించిన షేరు తాజాగా బుధవారం 23 శాతానికి పతనమైంది. ఈ పరిమాణాలన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ ఫోక్స్ వ్యాగన్ సీఈఓ మార్టిన్ వింటర్‌కార్న్ తన పదవికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా మార్టిన్ వింటర్‌కార్న్ మాట్లాడుతూ 'గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నేను దిగ్ర్భాంతికి గురయ్యాను. అన్నింటికి మించి ఫోక్స్ వ్యాగన్ గ్రూపులో ఇంత పెద్ద స్థాయిలో మోసం జరిగే అవకాశం ఉందని తేలడంతో నేను షాక్‌కు లోనయ్యా'నని తెలిపారు.
'ఫోక్స్ వ్యాగన్‌కు ఇప్పుడు కొత్త ప్రారంభం కావాలి. అది సిబ్బంది విషయంలోనే జరగాలి. అందుకు మొదటిగా నా రాజీనామాయే' అని ఆయన తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు.
అసలేం జరిగింది?
జర్మనీకి చెందిన ఫోక్స వ్యాగన్ కార్ల తయారీ సంస్ధ తయారు చేసిన కార్ల ఇంజన్ల నుంచి వెలువడే కాలుష్య కారక వాయువుల విడుదలను తగ్గించే చూపే పరికరాలను అమర్చి, యావత్ ప్రపంచాన్ని మోసం చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం సహా పలు దేశాలు ఫోక్స్ వ్యాగన్‌పై దర్యాప్తు చేపట్టాయి.

ఎలా బయటపడింది?
కాలుష్య నిర్ధారణ పరీక్షల్లో ఫోక్స్ వ్యాగన్ నెగ్గడం కోసం తక్కువ స్థాయిలో కాలుష్య కారక వాయువులను వెలువరిచేలా ఒక పరికరాన్ని అమర్చారని ఆరోపిస్తూ గత వారం 4.82 లక్షల డీజిల్ కార్లను గత శుక్రవారం వెనక్కి పంపించింది. వీటిల్లో ఫోక్స్ వ్యాగన్ జెట్టా, బీటిల్, గోల్ఫ్, పాసత్ తదితర మోడళ్లు ఉన్నాయి.

ఎలా బయటపడింది?
అమెరికాలో ఫోక్స్ వ్యాగన్ సంస్ధ తయారు చేసిన 4.8 లక్షల డీజిల్ వాహనాల్లో కాలుష్య సమస్య ఉన్నందున, సరి చేసి ఇవ్వాలని అమెరికా పర్యావరణ రక్షణ ఏజెన్సీ (ఈపీఏ) ఫోక్స్ వ్యాగన్‌ను ఆదేశించింది. ఒక ప్రత్యేక సాప్ట్ వేర్ ద్వారా కాలుష్య నిర్ధారణ పరీక్షల సమయంలో తక్కువ స్థాయిల్లో ఉద్గారాలు వెలువడేలా ఆపరికరాన్ని రూపొందించారు.

ఎలా బయటపడింది?
అమెరికాలో అనుమతించిన స్థాయి కంటే 40 రెట్లు కాలుష్య కారక వాయువులన్న విషయాన్ని దాచి పెట్టగలిగింది. దీంతో ఈపీఏతో పాటు అమెరికా న్యాయ విభాగం, ప్రాసిక్యూటర్ ఆఫ్ న్యూయార్క్, కెనడా పర్యావరణ అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నారు.

రంగంలోకి జర్మనీ ఛాన్సలర్
ఫోక్స్ వ్యాగన్ కాలుష్య కుంభకోణంతో ఆదేశ ప్రతిష్ట మసకబారడంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలో మోర్కెల్ రంగంలోకి దిగారు. పూర్తి పారదర్శకతతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని యాజమాన్యానికి ఆమె సూచించారు. ఈ వివాద పరిష్కర వ్యయాల కోసం మూడో త్రైమాసికంలో కంపెనీ 7.3 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పక్కన పెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications