ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని ఆరు టెలికాం సర్కిల్స్‌లో జిఎస్‌ఎం టెలికాం సేవలు అందిస్తున్న యూనినార్ తన పేరుతో టెలినార్‌గా మార్చుకుంది. రీ బ్రాండింగ్ కోసం దేశవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో టెలినార్ గ్రూపు ఆసియా ప్రాంత హెడ్ మార్టెన్ కార్ల్‌సెన్ సోర్బి ప్రకటించారు.
ఈ సందర్భంగా వివేక్ సూద్, సీఈఓ, టెలినార్ ఇఁడియా మాట్లాడుతూ టెలినార్ సంస్ధ ప్రపంచ వ్యాప్తంగా 13 దేశాల్లో సేవలను అందిస్తుందన్నారు. టెలినార్ సంస్ధ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త ఆఫర్లతో వ్యాపారాన్ని ప్రగతి పథంలో కొనసాగిస్తుందన్నారు. సంస్ధ యొక్క పేరు మార్చడం అనేది మా నిబద్ధతకు నిదర్శనమన్నారు.
టెలినార్ సంస్ధ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందిస్తూ మరింత అభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నానన్నారు. దేశ వ్యాప్తంగా యూనినార్ సంస్ధలో 3,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరూ టెలినార్ సంస్ధలో భాగమేనన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కంపెనీకి ప్రస్తుతం 250 సొంత స్టోర్లు ఉన్నాయి.

యూనినార్ ఇప్పుడు అయింది టెలినార్
తన మాతృ సంస్థ టెలినార్ బ్రాండ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఎపీ, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ కె శ్రీనాథ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సంవత్సరం చివరికల్లా వీటి సంఖ్య 300 నుంచి 320 వరకు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

యూనినార్ ఇప్పుడు అయింది టెలినార్
ముకేశ్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ జియో కంపెనీ ప్రవేశపెట్టే నాలుగో తరం (4జి) టెలికాం సేవలతో తమకు ఎలాంటి పోటీ ఉండదని శ్రీనాథ్ అన్నారు. అవసరమైతే 4జి సేవలు సైతం అందించేలా తమ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

యూనినార్ ఇప్పుడు అయింది టెలినార్
సబ్ సే సస్తా వంటి ఆఫర్లతో మాస్ మార్కెట్‌పై దృష్టి పెట్టడం ద్వారా ఎపి, తెలంగాణల్లో కనెక్షన్లు, ఆదాయ పరంగా టెలినార్ నాలుగో స్థానంలో ఉన్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 40 శాతం ప్రజానీకానికి టెలినార్ మొబైల్ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి.

యూనినార్ ఇప్పుడు అయింది టెలినార్
గ్రామీణ ప్రాంతంలో మరిన్ని టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఖాతాదారుల సంఖ్య మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. తమ నెట్‌వర్క్ లోపాలతో కాల్‌డ్రాప్స్ సమస్య ఎదుర్కొనే వినియోగదారులకు పర్ సెకండ్ పల్స్ రేటుతో ఖర్చులు రీఇంబర్స్ చేయనున్నట్టు టెలినార్ ఇండియా ఎపి, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ చెప్పారు.

యూనినార్ ఇప్పుడు అయింది టెలినార్
ఎస్‌టిడి, ఐఎస్‌టిడి కాల్స్‌కు సైతం ఇది వర్తిస్తుందన్నారు. సన్‌ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వి, ఐడిఎఫ్‌సితో కలిసి సమీప భవిష్యత్‌లో మొబైల్ బ్యాంకింగ్ సేవలు సైతం ప్రారంభించే యోచన ఉందన్నారు.


Click it and Unblock the Notifications