భారత్‌లో దాదాపు అన్ని పెద్ద మల్టీప్లెక్స్‌ల టికెట్లను, ఎంటర్ టెయిన్ మెంట్ టికెట్లను విక్రయిస్తున్న పాపులర్ వెబ్‌సైట్ 'బుక్ మై షో డాట్ కాం'పై డిజిటల్ పేమెంట్, ఎం-కామర్స్ సేవల సంస్థ పేటీఎం పోటీగా రానుంది.
పేటీఎం వ్యవస్థాపక చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ మూవీ టికెట్ల వ్యాపారంలోకి ప్రవేశించడం ద్వారా సాధ్యమైనంత మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని భావిస్తున్నామన్నారు.

పీవీఆర్‌తో పేటీఎం ఒప్పందం
దేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్ చెయిన్ నిర్వహిస్తున్న పీవీఆర్ తో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 33 నగరాల్లోని 75 మల్టీప్లెక్స్ లలో 370 స్క్రీన్లను నిర్వహిస్తున్న పీవీఆర్ టికెట్లు ఇకపై పేటీఎంలో లభ్యం కానున్నాయి.

పీవీఆర్‌తో పేటీఎం ఒప్పందం
తమకు బుక్ మై షోతో పోటీ లేదంటూనే, సంవత్సరానికి రూ. 3 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఈ రంగంలో 25 శాతం సినిమా టికెట్ల విక్రయాలు ఆన్ లైన్లో సాగుతున్నాయని, వాటిల్లో 30 శాతం మార్కెట్ వాటాగా 4.4 కోట్ల బుకింగ్స్ పీవీఆర్ వేనని శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు.

పీవీఆర్‌తో పేటీఎం ఒప్పందం
ఈ ఒప్పందంపై పీవీఆర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీనాక్షీ వాజ్ పేయి మాట్లాడుతూ ఇప్పటికే పేటీఎం తో చర్చలు ముగిశాయని, అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందన్నారు.
సొంతంగా బుకింగ్ సైట్లున్న అన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో తాము డీల్స్ కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నామని పేటీఎం ప్రకటించింది.

పీవీఆర్‌తో పేటీఎం ఒప్పందం
దీంతో మూవీ టిక్కెట్ల రంగాన్ని ఏలుతున్న బుక్ మై షో ముందుకు పెను సవాలు వచ్చినట్టేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే బుక్ మై షోతో చాలా సినిమా చైన్ కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications