ఇన్ఫోసిస్‌కు జీఎస్‌టీ ప్రాజెక్టు: విలువ 1320 కోట్లు
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రూ. 1320 కోట్ల విలువైన అతి పెద్ద కాంట్రాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం నుంచి లభించనుంది. దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)ను అమలు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించి, అభివృద్ధి చేసే కాంట్రాక్టును ప్రభుత్వం ఇన్ఫోసిస్‌కు కేటాయించనుంది.
ఈ ప్రాజెక్టు కోసం టిసిఎస్, విప్రో, టెక్ మహీంద్రా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సైతం ఈ కాంట్రాక్ట్ కోసం పోటీ పడ్డాయి. చివరికి కాంట్రాక్ట్ ఇన్ఫోసిస్‌కు దక్కింది. ఇన్ఫోసిస్ తక్కువకే బిడ్ దాఖలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఇన్ఫోసిస్‌కు జీఎస్‌టీ ప్రాజెక్టు: విలువ 1320 కోట్లు
ఈ ప్రాజెక్టు గురించి ఆర్ధిక మంత్రిత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ 'ఇన్ఫోసిస్ ముందుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తుంది. ఆ తర్వాత జీఎస్‌టీ అమలుకు అవసరమైన నెట్ వర్కింగ్ సిస్టమ్‌ను నిర్మిస్తుంది' అని ఆయన వివరించారు.

ఇన్ఫోసిస్‌కు జీఎస్‌టీ ప్రాజెక్టు: విలువ 1320 కోట్లు
ఐదు సంవత్సరాల పాటు సాగే ఈ ప్రాజెక్టు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీ అమలు లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో సరిగ్గా ఆరు నెలల ముందు ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.

ఇన్ఫోసిస్‌కు జీఎస్‌టీ ప్రాజెక్టు: విలువ 1320 కోట్లు
జీఎస్‌టీ అమలుకు అవసరమైన సాప్ట్‌వేర్ , మౌలిక సదుపాయాలు, సమాచారం అందించేందుకు 2013లోనే జీఎస్‌టీ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎస్) అనే కంపెనీని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వం, రాష్ట్రాల డేటాబేస్‌లను జీఎస్‌టీ నెట్‌వర్క్ అనుసంధానం చేస్తుంది.

ఇన్ఫోసిస్‌కు జీఎస్‌టీ ప్రాజెక్టు: విలువ 1320 కోట్లు
దీంతో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే టామ్స్ షూస్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ డీల్ ప్రకారం టామ్స్ షూస్‌కు మూడు సంవత్సరాల పాటు అంతర్జాతీయ డిజిటల్ కార్యకలాపాలను సంబంధించిన సేవలను ఇన్ఫోసిస్ అందించనుంది.


Click it and Unblock the Notifications