హైదరాబాద్: నగరంలో రియల్టీ రంగం ఊపందుకుంది. చాలా మంది మధ్యతరగతి కుటుంబాల వారు ఇంటికి కొనుగోలు చేసేందుకు మందుకు వస్తుండటంతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె శ్యామ్ రావు వెల్లడించారు.
శుక్రవారం కంపెనీ కార్పోరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఐటి హబ్‌లోని రాయదుర్గంలో సమీకృత టౌన్‌షిప్ ప్రాజెక్టును అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు.
సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులో ఐటి కార్యాలయాలు, మాల్స్ సహా హై ఎండ్ కస్టమర్ల కోసం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నిర్మాణాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి, రాయదుర్గంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికల్లా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

గూగుల్, క్యాప్‌జెమినీ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో హైదరాబాద్ రియల్టీ రంగం ఊపందుకుంటుందన్నారు. దీంతో రాబోయే మూడేళ్లలో హైదరాబాద్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. దీంతో పాటు విస్తరణలో బెంగళూరు, పుణె నగరాలకు కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నట్లు శ్యామ్ రావు తెలిపారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గత ఏడాది 10 కోట్ల రూపాయలతో వివిధ కార్యకలాపాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అలాగే ఈ ఏడాది హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లోని 60 ప్రభుత్వ పాఠశాలల్లోని 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications