చిన్న బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు దేశ వ్యాప్తంగా 10 సంస్ధలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ చిన్న బ్యాంకులు సూక్ష్మ రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు బ్యాంకింగ్ సేవలను అందించనున్నాయి.
ఈ బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించి సూక్ష్మ రైతులు, సూక్ష్మ వ్యాపార సంస్థలు, చిన్న పరిశ్రమలు, అవ్యవస్థీకృత రంగంలోని సంస్థలకు రుణాలను ఇస్తాయి. ఈ బ్యాంకుల కోసం 72 సంస్థలు దరఖాస్తు చేసుకోగా 10 సంస్థలకు ఆర్‌బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
ఈ జాబితాలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఎయు ఫైనాన్షియర్స్ (జైపూర్), క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంకు (జలంధర్), దిశా మైక్రోఫిన్ (అహ్మదాబాద్), ఈస్‌ఎఎఫ్ మైక్రోఫైనాన్స్ (చెన్నై), జనలక్ష్మి ఫైనాన్షియల్ (బెంగుళూరు), ఆర్‌జివిఎన్, మైక్రోఫైనాన్స్ (గౌహతి), సూర్యోదయ మైక్రోఫైనాన్స్ (ముంబై), ఉత్కర్ష్ మైక్రో ఫైనాన్స్ (వారణాసి) ఉన్నాయి.

10 చిన్న బ్యాంకులకు ఆర్‌బీఐ ఆమోదం, విధానాలివే..!
చిన్న బ్యాంకులకు ఇచ్చిన అనుమతి 18 నెలల పాటు వర్తిస్తుందని, ఈ లోగా చిన్న ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్‌సీ) ఏర్పాటుకు విధివిధానాలను ఆయా సంస్ధలు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. గత నెలలో 11 పేమెంట్ బ్యాంకులకు అనుమతించిన ఆర్‌బీఐ, అంతక ముందు రెండు కొత్త బ్యాంకులకూ ఆమోదముద్ర వేసింది.

10 చిన్న బ్యాంకులకు ఆర్‌బీఐ ఆమోదం, విధానాలివే..!
ఈ బ్యాంకుల పనితీరుపై అవసరమైతే మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనుంది. రానున్నకాలంలో మరిన్ని లైసెన్సులు ఇవ్వడానికి ఆర్‌బిఐ ఈ బ్యాంల పనితీరును పరిగణనలోకి తీసుకోనుంది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో భాగంగానే చిన్న ఫైనాన్షియల్ బ్యాంకులను ఆర్‌బీఐ అందుబాటులోకి తెస్తోంది.

10 చిన్న బ్యాంకులకు ఆర్‌బీఐ ఆమోదం, విధానాలివే..!
కొత్తగా రాబోయే చిన్న బ్యాంకులు దేశంలోనే ఎక్కడైనా తమ కార్యకలాపాలు సాగించవచ్చు. సుమారు రూ. 25లక్షల దాకా లోన్ ఇచ్చే సత్తా కలిగి ఉండాలి. వీటితో పాటు బ్యాంకులకు వర్తించే నగదు నిల్వల నిష్పత్తి, ఎస్ఎస్ఆర్ తదితర నిబంధనలు అన్నీ వీటికి కూడా వర్తిస్తాయి.

10 చిన్న బ్యాంకులకు ఆర్‌బీఐ ఆమోదం, విధానాలివే..!
ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుల్లో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులున్నాయి. ఫిర్యాదులు పరిష్కరించాడనికి ఓ ప్రత్యేక వ్యవస్ధను రూపొందించుకోవాలి. ప్రస్తుత విధి విధానాలకు తగు మార్పులు చేసి, ఈ ఆర్ధిక సంవత్సరంలో మరిన్ని బ్యాంకులకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.


Click it and Unblock the Notifications