చెక్ బౌన్స్ కేసులు: అక్కడి కోర్టుల్లో మాత్రమే
చెక్ బౌన్స్ కేసుల్లో లక్షలాది మందికి ప్రయోజనం కలిగించే చర్యలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. తాజాగా చెక్ బౌన్స్ (సవరణ) ఆర్డినెన్స్, 2015ను మళ్లీ జారీ చేసేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్‌తో చెక్కు ఏ ప్రాంతంలోని బ్యాంక్‌లో బౌన్స్ అయితే ఆ ప్రాంతంలోని కోర్టుల్లో మాత్రమే కేసులను దాఖలు చేయాల్సి ఉంటుంది.
బుధవారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెక్ బౌన్స్ కేసుల్లో చట్టపరమైన పరిధికి సంబంధించిన అంశాల్లో స్పష్టత తీసుకురావడం కోసం, చెక్కుల విశ్వసనీయతను పెంచేందుకు ఈ చర్య దోహదపడుతుందని ఒక ప్రకనటలో తెలిపింది.

చెక్ బౌన్స్ కేసులు: అక్కడి కోర్టుల్లో మాత్రమే
చెక్ బౌన్స్‌ల విషయంలో జారీ చేసిన బ్యాంక్ బ్రాంచ్ నుంచి జారీ అయితే ఆ ప్రాంతంలోని కోర్టుల్లోనే కేసు పైల్ చేయాలని 2014లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల చెక్కులు తీసుకున్న వాళ్లకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వంలో చట్టంలో సవరణ చేయాలని నిర్ణయించింది.

చెక్ బౌన్స్ కేసులు: అక్కడి కోర్టుల్లో మాత్రమే
దీన్ని అధిగమించేందుకు ఎన్ఐ (సవరణ) చట్టం - 2015 బిల్లును ఈ ఏడాది మే నెలలో లోక్‌సభలో ఆమోదించింది. అయితే రాజ్యసభ ఆమోదించక పోవడంతో బిల్లు చెల్లకుండా పోయింది. అయితే ఈ బిల్లుకు ఆమోదింపచేసుకోవడానికి రాజ్యసభలో తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం మరోసారి ఆర్డినెన్స్‌ను రూపొందించింది.

చెక్ బౌన్స్ కేసులు: అక్కడి కోర్టుల్లో మాత్రమే
దీనిపై వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో పాటు, ఎన్‌డిఎకు చెందిన కొంత మంది ఎంపీలు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మరోసారి ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చెక్ బౌన్స్ కేసులతో ఇబ్బంది పడుతున్న దాదాపు 18 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.

చెక్ బౌన్స్ కేసులు: అక్కడి కోర్టుల్లో మాత్రమే
సరైన ఫండ్స్ లేకుండా చెక్కులు జారీ చేయడం ఇతరత్రా కారణాల వల్ల చెక్ బౌన్స్ అయ్యే కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎన్ఐ చట్టంలోని సెక్షన్ 138 అవకాశాన్ని కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications