ఆన్‌లైన్ షాపింగ్: ఎస్‌బీఐ 'సింప్లీక్లిక్' క్రెడిట్ కార్డు
వినియోగదారుల ఆన్‌లైన్ షాపింగ్ అవసరాల కోసం 'సింప్లీక్లిక్' పేరిట ఎస్‌బీఐ కార్డ్ సంస్ధ ఓ క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. అమెజాన్ ఇండియా, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, ఓలా క్యాబ్స్, లెన్స్‌కార్ట్, ఫుడ్ పాండా, ఫ్యాబ్ ఫర్నిష్ వంటి సంస్థల భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది.
సాధారణ కార్డుతో పోలిస్తే, ఈ కొత్త క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్‌లో చేసే షాపింగ్‌కు 5 రెట్లు అధికంగా రివార్డు పాయింట్లు లభిస్తాయని ఎస్‌బీఐ కార్డ్ సీఈవో విజయ్ జసూజా తెలిపారు. భాగస్వామ్య సంస్థల పోర్టల్స్‌లో షాపింగ్ చేస్తే 10 రెట్లు అధికంగా రివార్డు పాయింట్ల లభిస్తాయని తెలిపారు.

ఆన్‌లైన్ షాపింగ్: ఎస్‌బీఐ 'సింప్లీక్లిక్' క్రెడిట్ కార్డు
దేశంలో ఆన్‌లైన్ అమ్మకాలు శరవేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ విభాగంపై ఎస్‌బీఐ కార్డు దృష్టి సారించింది. ఈ కార్డుతో ఏడాదికి ఆన్ లైన్‌లో రూ. 2 లక్షల షాపింగ్ చేసిన వారికి రూ. 4000 దాకా విలువ చేసే వోచర్లు బహుమతిగా ఇస్తామని వెల్లడించారు.

ఆన్‌లైన్ షాపింగ్: ఎస్‌బీఐ 'సింప్లీక్లిక్' క్రెడిట్ కార్డు
అయితే కార్డు తీసుకోవాలనుకునే వారు వన్ టైమ్ ఫీజు కింద రూ. 499 కట్టాల్సి ఉంటుందని జసూజా పేర్కొన్నారు. దానికి ప్రతిగా రూ. 500 విలువ చేసే అమెజాన్ ఈ-గిఫ్ట్ వెల్‌కమ్ వోచర్ లభిస్తుంది.

ఆన్‌లైన్ షాపింగ్: ఎస్‌బీఐ 'సింప్లీక్లిక్' క్రెడిట్ కార్డు
సాధారణ షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో కూడా ఈ క్రెడిట్ కార్డుని వినియోగించుకోవచ్చు. ఏడాదికి రూ. లక్షకు మించి ఖర్చుపెడితే, రెన్యువల్ ఫీజు వాపసు లభిస్తుందని జసూజా చెప్పారు.

ఆన్‌లైన్ షాపింగ్: ఎస్‌బీఐ 'సింప్లీక్లిక్' క్రెడిట్ కార్డు
పెట్రోల్ బంకుల్లో 2.5 శాతం సర్ ఛార్జి కూడా ఉండదని తెలిపారు. మొత్తంమీద వినియోగదారులకు దాదాపు 15 రెట్లు అధికంగా రివార్డు పాయింట్లు లభించినట్లవుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications