ప్రభుత్వ బ్యాంక్ అయిన ఆంధ్రా బ్యాంకుకు గత ఐదు నెలలుగా పూర్తిస్థాయి ఎండీ, సీఈఓ లేని సంగతి తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.కే. కల్రా అదనపు బాధ్యతగా ఎండీ, సీఈఓ హోదాలో కొనసాగుతున్నారు. ఇటీవలే ఆంధ్రా బ్యాంకు ఇన్‌ఛార్జిగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు.
అయితే తాజాగా ఆంధ్రాబ్యాంకుతో పాటు మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకూ పూర్తిస్తాయి ఎండీ, సీఈఓలను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి నియామకాల కోసం బుధవారం (సెప్టెంబర్ 16)న ఇంటర్యూలు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రా బ్యాంకు ఎండీ పోస్టుకు ఇంటర్యూ
వివిధ బ్యాంకుల్లో
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న 12 మందిని ఈ ఇంటర్యూలకు పిలిచారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిప్యూటీ ఎండీలుగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తూ ఇంకా కనీసం రెండేళ్ల పదవీ కాలం ఉన్న వారిని ఈ ఇంటర్యూల్లో పరిగణనలోకి తీసుకున్నారు.

ఆంధ్రా బ్యాంకు ఎండీ పోస్టుకు ఇంటర్యూ
ఇంటర్యూలకు హాజరుకానున్న వారిలో ఆంధ్రాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్రాతో పాటు ఆర్‌కే గుప్తా (బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర), ఎంకే జైన్ (ఇండియన్ బ్యాంక్), ముఖేష్ జైన్ (పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్), జేకే గర్గ్ (యూకో బ్యాంక్), బీఎస్ రామారావు (విజయా బ్యాంక్), బీకే దివాకర్ (సెంట్రల్ బ్యాంక్), ఎస్ఎస్ పటేల్ (ఓబీసీ) తదితరులు ఉన్నారు.

ఆంధ్రా బ్యాంకు ఎండీ పోస్టుకు ఇంటర్యూ
ఆంధ్రాబ్యాంకు ఛైర్మన్, ఎండీ (సీఎండీ)గా వ్యవహరించిన సీవీఆర్ రాజేంద్రన్ ఈ ఏడాది ప్రారంభంలో పదవీ విరమణ చేశారు. వెనువెంటనే కొత్త సీఎండీని ప్రభుత్వం నియమించలేదు. ఆ తర్వాత కాలంలో ఛైర్మన్, ఎండీ పోస్టులను రెండుగా విడదీశారు. దీనికి తోడు ఎండీ పోస్టుకు అదనంగా సీఈఓ పోస్టుని సృష్టించారు.

ఆంధ్రా బ్యాంకు ఎండీ పోస్టుకు ఇంటర్యూ
ఇంటర్యూలకు హాజరైన వారి నుంచే ఖాళీగా ఉన్న ఇండియన్ బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, యూకో బ్యాంకులకు ఎండీ, సీఈఓలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications