సొంతింటి సాకారం అనేది ప్రతి సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. అదే విధంగా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
అంతేకాదు మన అవసరాలకు అనువైన ఇంటిని కొనుగోలు చేయాలి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇల్లు కోనుగోలు అనేది ఖరీదైన విషయం కాబట్టి.

తొలిసారి ఇంటిని కొనేటప్పుడు
తొలిసారి ఇంటిని కోనుగోలు చేసేటప్పుడు మీ కుటుంబానికి అనువుగా ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఎంత బడ్జెట్‌లో, ఎలాంటి ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రదేశం
అవసరాలకు సరిపడ ఇంటిని కొనుగోలు చేద్దామని నిర్ణయించుకున్నాక అనువైన ప్రదేశాన్ని గుర్తించాలి. దీర్ఘకాలం నివాసం ఉండటానికి ఇంటిని కొనుగోలు చేస్తున్నారా? లేదా ఇతరత్రా అవసరాల కోసం ప్రాపర్టీని కొంటున్నారా? అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వీటితో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రి, స్కూలు, షాపింగ్ మాల్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయా లేదో చూసుకోండి.

ముందుగా రియల్టర్లను సంప్రదించండి
రియల్టర్ అవసరం లేకుండా డైరెక్టుగా బిల్డర్ దగ్గరి నుంచే ఇంటిని కొనుగోలు చేస్తే, కమిషన్ చెల్లించే అవసరం ఉండదు. దీని ద్వారా డబ్బులు ఆదా చేయొచ్చు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై సరైన అవగాహన లేకపోతే మాత్రం డైరెక్టుగా కాకుండా రియల్టర్ ద్వారా ఇంటిని కొనుగోలు చేయడం మంచిది.
బడ్జెట్‌పై అవగాహాన
ఇంటిని కొనుగోలు చేయాలని భావించినప్పుడు ముందుగా ఎంత బడ్జెట్ అనేది చూసుకోవాలి. మీ బడ్జెట్‌కు సరిపడ ఇల్లు దొరికితే మంచిది లేదంటే బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం లాంటివి చేయండి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఆర్ధిక సమస్యలు లేనప్పుడే ఇంటిని కొనాలనే ఆలోచన పెట్టుకుంటే మంచిది.

బ్యాంకుల నుంచి రుణం పొందడానికి
ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు బ్యాంకుల్లో రుణం పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లను ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది.


Click it and Unblock the Notifications