ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ ఆటో ఛైర్మన్ రాహుల్ బజాజ్ మరోమారు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కీలక వడ్డీ రేట్ల కోతపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన పారిశ్రామిక వేత్తలో భేటీలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించాలని పారిశ్రామిక వేత్తలు అడుగుతుండగా రేట్ల కోత నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్‌కే వదిలేయడమే మంచిదని ఆయన అన్నారు.
ఎకనమిస్ట్ ఇండియా సమ్మిట్‌లో రాహల్ బజాజ్ ప్రసంగిస్తూ 'కీలక వడ్డీరేట్లను తగ్గించాలని రాజన్‌కు ఎవరూ చెప్పనక్కర్లేదు. ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు తెలుసు. ఈ విషయంలో రాజన్‌ను మించిన మరో వ్యక్తి ఈ దేశంలో ఎవరూ లేరు. రేట్ల తగ్గింపుపై ప్రభుత్వం కంటే ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆలోచన భేషుగ్గా ఉంది' అని చెప్పారు.

రాజన్‌పై రాహల్ బజాజ్ సంచలన వ్యాఖ్యలు

గడిచిన కొన్ని నెలలుగా వడ్డీరేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ రాజన్ వీటిని పట్టించుకో వడం లేదని, ఆందోళనకర స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించే వరకు వడ్డీరేట్లను ముట్టుకోలేదని రాహుల్ బజాజ్ అన్నారు.

రాజన్‌పై రాహల్ బజాజ్ సంచలన వ్యాఖ్యలు
జనవరి నుంచి ఆర్‌బీఐ వడ్డీరేట్లను పావుశాతం చొప్పున మూడుసార్లు తగ్గించినప్పటికీ బ్యాంకులు వీటిని వినియోగదారులకు చేరవేయడంలో విఫలమైందన్నారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ తీరు సంస్కరణల అమలుపై సందేహాలు రేకేత్తించేలా ఉందని రాహుల్ విమర్శించారు.
రాజన్‌పై రాహల్ బజాజ్ సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ సమావేశాలు తరచూ వాయిదా పడటానికి ముగింపు పలకాలంటే కాంగ్రెస్‌కు బీజేపీ స్నేహపూర్వక హస్తం అందిచాలన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మద్య వాతావరణాన్ని చూస్తుంటే, ఆనాటి ఎమర్జన్సీ పరిస్థితుల కంటే కూడా దారుణంగా ఉందని తెలిపారు.

Click it and Unblock the Notifications