ఏడుగురు: ఇన్ఫోసిస్ నుంచే నలుగురు
ఆసియా, ఫసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ దాతల జాబితాను ఫోర్బ్స్ ఆసియా మ్యాగజైన్ విడుదల సోమవారం విడుదల చేసింది. ఈ మ్యాగజైన్ విడుదల చేసిన 9వ జాబితా ఇది. ఆరోగ్య సంరక్షణ, వృత్తి శిక్షణ, విద్యా రంగాలకు చేసిన దానాల ఆధారంగా ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది.
13 దేశాలకు చెందిన జాబితాలో ఏడుగురు భారతీయలకు చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏడుగురు భారతీయుల్లో ముగ్గురు ఎస్ గోపాలకృష్ణన్, నందన్ నీలెకని, ఎస్‌డి శిబులాల్ ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకులే కావడం విశేషం.
ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ పేరు సైతం ఈ జాబితాలో చోటు చేసుకుంది. రోహన్ తండ్రి నారాయణ మూర్తి తరఫున ఆరోగ్య, విద్యా రంగాలకు దానాలు చేస్తుంటారు. మన దేశానికి పురాతన ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌కు రోహన్ మూర్తి రూ. 34 కోట్లు విరాళం ఇచ్చారు.

ఏడుగురు: ఇన్ఫోసిస్ నుంచే నలుగురు
కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు, విద్యారంగ వాణిజ్యవేత్త సన్నీ వర్కీకి సైతం ఫోర్బ్స్ దాతల జాబితాలో చోటు దక్కించుకున్నారు. వర్కీ దుబాయ్ కేంద్రంగా జెమ్స్ ఎడ్యుకేషన్ పేరుతో 19 దేశాల్లో 70 ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారు.

ఏడుగురు: ఇన్ఫోసిస్ నుంచే నలుగురు
బిల్ గేట్స్, వారెన్ బఫెట్ నేతృత్వంలో 'సంపద వెనక్కు ఇస్తామనే ప్రమాణం' (గివింగ్ ప్లెడ్జ్ ఇనీషియేటివ్) కార్యక్రమంలో భాగంగా తన సంపద 2.25 బిలియన్ డాలర్లు (రూ. 14,625 కోట్లు) విరాళంగా ఇస్తానని గత జూన్‌లో ప్రకటించారు.

ఏడుగురు: ఇన్ఫోసిస్ నుంచే నలుగురు
ఫోర్బ్స్ రూపొందించిన భారత్‌కు చెందిన అగ్రశ్రేణి దాతల బాజితాలో ఇప్పటికే సన్నీ వర్కీ ఉన్నారు. లండన్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న సురేష్ రామకృష్ణన్, మహేష్ రామకృష్ణన్ అనే సోదరుల పేర్లు సైతం ఫోర్బ్స్ పత్రిక తాజా దాతల జాబితాలో చోటు దొరికింది.

ఏడుగురు: ఇన్ఫోసిస్ నుంచే నలుగురు
వైట్‌కోంబ్ అండ్ షాప్టెన్‌బరి టైలర్స్ వ్వవస్ధాపకులు వీరిద్దరు. దేశీయంగా దర్జీ పనిలో నైపుణ్యం పెంచేందుకు వీరు రూ. 19.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులతో దేశంలోని 4,000 మందికి పైగా వృత్తి శిక్షణ ఇచ్చారు. తద్వారా 2004 సునామీ బాధితులతో పాటు, కష్టాల్లో ఉన్న మహిళలు కూడా ఇలా ఉపాధి పొందుతున్నారు.


Click it and Unblock the Notifications