హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్‌లో గన్‌ఫౌండ్రీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ప్రధాన కార్యాలయాన్ని వచ్చే ఏడాది కల్లా హైటెక్ సిటీకి తరలించనున్నట్లు ముఖర్జీ తెలిపారు. దాదాపు 2.30 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్ధలంలో ఉండే విధంగా నూతన ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నారు.
మాదాపూర్‌లో మైండ్ స్సేప్ రహేజా ఐటి పార్క్ సమీపంలో కొన్నేళ్ల క్రితం 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్‌బీహెచ్ కోనుగులు చేసింది. ఇప్పుడు ఆ స్థలంలో రూ. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 18 నెలల వ్వవధిలో భవన నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ నెట్‌వర్క్ పరిధిలో కస్టమర్లకు మరింత చేరవయ్యేందుకు గాను సైబరాబాద్ జోన్ పేరిట కొత్త జోన్‌ను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
అయితే ఎస్‌బీహెచ్ గన్ ఫౌండ్రీలో ఉన్న భవనం యధావిధిగా ఉక్కడే ఉంటుందని, ప్రధాన కార్యాలయాన్ని తరలించినా ఆ భవనాలను ఇతర విభాగాల కోసం వినియోగిస్తామన్నారు. 107 శాఖలతో కూడిన ఈ జోన్ వ్యాపారం 16,228 కోట్ల రూపాయలుగా ఉందని అన్నారు.

100 కోట్లతో మాదాపూర్‌లో ఎస్‌బీహెచ్ హెడ్ ఆఫీస్
వినియోగదార్లకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సేవలకు మరింత దగ్గర చేసేందుకు వీలుగా ఎస్‌బీహెచ్ ఒక మొబైల్ యాప్‌ను రూపొందించింది. దీన్ని శంతను ముఖర్జీ ఆవిష్కరించారు. దీనికి 'ఎస్‌బీహెచ్ టచ్' అని పేరు పెట్టారు. మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు ఈ యాప్ గేట్ వే మాదిరి పనిచేస్తుందన్నారు.

100 కోట్లతో మాదాపూర్‌లో ఎస్‌బీహెచ్ హెడ్ ఆఫీస్
ఈ ఆర్థిక సంవత్సరంలో పరపతి వృద్ధి రేటు 4-5 శాతం దాటకపోవచ్చని ఆయన తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించకపోవటమే ఇందుకు కారణమన్నారు. వడ్డీ వ్యయాలు తగ్గించుకునేందుకు పలు కంపెనీలు రుణాల చెల్లింపును చేపట్టాయని, దీంతో రుణాల మంజూరు 3,000 కోట్ల రూపాయల వరకు తగ్గాయని అన్నారు.

100 కోట్లతో మాదాపూర్‌లో ఎస్‌బీహెచ్ హెడ్ ఆఫీస్
బ్యాంకు వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో కార్పొరేట్ కంపెనీలు ప్రత్యామ్నాయంగా మార్కెట్ల నుంచి నిధులను సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని ముఖర్జీ తెలిపారు. ఎంఎస్‌ఎంఇ, రిటైల్, పర్సనల్ విభాగంలో మాత్రం ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు చేసుకుంటున్నట్లు ముఖర్జీ తెలిపారు.

100 కోట్లతో మాదాపూర్‌లో ఎస్‌బీహెచ్ హెడ్ ఆఫీస్
అక్టోబర్ చివరి నాటికల్లా ఎంఎస్‌ఎంఇ రంగానికి 2,500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. మొండిబకాయిలు తగ్గించుకునేందుకు రికవరీలతోపాటు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications