బ్యాంకింగ్ సేవల రంగంలో అందుబాటులోకి వస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇన్ఫోసిస్ సిద్ధమైంది. చిన్న ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులకు ఉపయోగపడే రెండు నూతన ఫైనాన్షియల్ ఉత్పత్తులను కంపెనీ బుధవారంనాడు విడుదల చేసింది.
ఫినాకిల్ పేమెంట్స్ బ్యాంకు, ఫినాకిల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సొల్యూషన్స్ పేరుతో వీటిని ఇన్ఫోసిస్ అందుబాటులోకి తెచ్చింది. పేమెంట్స్ బ్యాంక్స్, చిన్న ఫైనాన్షియల్ బ్యాంకుల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్టు ఇన్ఫోసిస్ ఫినాకిల్ రీజినల్ హెడ్ వెంకట్రామ గోసవి తెలిపారు.

పేమెంట్ బ్యాంకులకు ఇన్ఫోసిస్ ‘ఫినాకిల్'
ట్రెడిషనల్ బ్యాంకింగ్, ఏజెన్సీ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్, మైక్రో ఏటీఎం లాంటి ఉత్పత్తులను ఉపయోగించుకుని వినియోగదారులకు పేమెంట్ బ్యాంకులను మరింతగా దగ్గరకు చేర్చడమే తమ ఉద్ధేశ్యమని పేర్కొన్నారు. బిజినెస్ డిమాండ్‌ను బట్టి ఈ ఉత్పత్తులు వినియోగదారుల అవసరాలను తీరుస్తాయని తెలిపారు.
పేమెంట్ బ్యాంకులకు ఇన్ఫోసిస్ ‘ఫినాకిల్'
బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విసృత పరచాలనే ఉద్దేశ్యంతో 11 కార్పొరేట్ సంస్థలకు చెల్లింపు బ్యాంక్ లైసెన్స్‌కు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం ప్రకటించిన సంగతి తెలిసిందే.

పేమెంట్ బ్యాంకులకు ఇన్ఫోసిస్ ‘ఫినాకిల్'
ఇలా అనుమతులు పొందిన కంపెనీల్లో కార్పొరేట్ దిగ్గజాలు ముకేష్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ఇండ స్ర్టీస్, కుమార మంగళం బిర్లా నాయకత్వంలోని ఆదిత్య బిర్లా నువో, ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని టెక్ మహీంద్రాతో పాటు దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ ఉన్న తపాలా శాఖ కూడా ఉంది.

పేమెంట్ బ్యాంకులకు ఇన్ఫోసిస్ ‘ఫినాకిల్'
అనుమతులు పొందిన ఇతర కంపెనీల్లో టెలికాం దిగ్గజాలు వొడాఫోన్, ఎయిర్‌టెల్, ఎన్‌ఎస్‌డిఎల్, చోళమండలం డిస్ర్టిబ్యూషన్ సర్వీసెస్, ఫినోపేటెక్ ఉన్నాయి. వీటితోపాటు సన్ ఫార్మా ప్రమోటర్ దిలీప్ శాంతిలాల్ షాంఘ్వీ, విజయ్ శేఖర్ శర్మకు చెందిన పేటీఎంలకు వ్యక్తిగత హోదాలో అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications