నార్వే ఆధారిత టెలినార్ గ్రూప్‌కు అనుబంధ సంస్ధ అయిన భారతదేశపు ప్రముఖ టెలికం సంస్ధ యునినార్, హువాయ్ ఇండియాతో కలిసి తమ సర్కిళ్ల పరిధిలో ఉన్న అన్ని నెట్‌వర్క్‌లను ఆధునీకరించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ సర్కిల్ పరిధిలో ఉన్న 3305 బేస్ స్టేషన్‌లను అత్యాధునిక సాంకేతికతతో కూడిన పరికరాలతో భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆధునీకరించడం జరుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా హువాయ్, యూనినార్ సంస్ధలో నిర్వహణ సేవల భాగస్వామిగా ఏర్పడింది.
ఈ డీల్ విలువ రూ.1,300 కోట్లకు పైమాటే. భారత టెలికాం రంగంలో మరియు టెలినార్ సంస్ధ ప్రస్థానంలో ఇతి అతిపెద్ద ఒప్పందం. ఈ నెట్ వర్క్ ఆధునీకరణ ద్వారా యూనినార్ మరింత నాణ్యమైన నెట్‌వర్క్, మెరుగైన వాయిస్, ఇంటర్ నెట్ సేవలను అందించడం జరుగుతుంది.

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్
యునినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిల్స్‌లో 2017 చివరినాటికి 24,000 సైట్స్‌లో టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేస్తామని, సాఫ్ట్‌వేర్‌ను జోడించడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేసేందుకు ఈ టెక్నాలజీతో వీలవుతుందని యునినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలియజేశారు.

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్
మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఎంతైనా స్పీడ్‌ను అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా 5,000 సైట్స్ ఆధునీకరణ పూర్తి అవుతుంది.

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్
''దేశవ్యాప్తంగా యునినార్ చందాదారుల సంఖ్య 4.8 కోట్లు. ఇందులో 24 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ కస్టమర్లు ప్రతినెల 3-4 శాతం పెరుగుతున్నారు. 1 జీబీ డేటాను రూ.100 లోపే అందిస్తున్నాం. కొత్త టెక్నాలజీతో వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి'' అని ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్స్ హెడ్ అనురాగ్ ప్రసాద్ తెలిపారు.

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్
2017 నాటికి ఇంటర్నెట్ చందాదారుల సంఖ్యను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. కాగా కంపెనీ కాల్ సెంటర్‌కు కాల్ డ్రాప్స్ ఫిర్యాదులు లేవని శ్రీనాథ్ తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications