పలు డిమాండ్ల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ సమ్మె ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు మినహా దాదాపుగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, వాటి అనుబంధ శాఖలు బుధవారం నాటి సమ్మెలో పాల్గొంటున్నాయి.
అయితే ఈ సమ్మెలో బ్యాంకింగ్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బ్యాంకింగ్ రంగానికి చెందిన ఏఐబీఈఏ, ఏఐబీఓఏ, బీఈఎఫ్‌ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ యూనియన్లు సమ్మెలో పాల్గొంటుండగా ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఎన్‌ఓబీయూయూ, ఎన్‌ఓబీఓలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.

సార్వత్రిక సమ్మెలో మేము సైతం
రాష్ట్రంలో మొత్తం 20 వేల మంది బ్యాంకు అధికారులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండగా దేశ వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది సమ్మె బాట పట్టారు.

సార్వత్రిక సమ్మెలో మేము సైతం
సమ్మెలో పాల్గొనే ఉద్యోగులు విధులు బహిష్కరించి బుధవారం ఆయా శాఖల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు బ్యాంకింగ్ యూనియన్ నాయకుడు రాంబాబు తెలిపారు.

సార్వత్రిక సమ్మెలో మేము సైతం
సమ్మెలో ఎస్‌బీఐ అధికారులు,ఉద్యోగులు పాల్గొనడం లేదని ఏఐబీఓసీ నాయకులు ఎంవీఎస్‌ఆర్ శర్మ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐ బ్యాంకులు యదావిధిగా పని చేస్తాయని ఆయన వెల్లడించారు.

సార్వత్రిక సమ్మెలో మేము సైతం
బంద్‌తో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వాణిజ్య కార్యకలాపాలు కూడా స్తంభించనున్నాయి. దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు కూడా మూతపడ్డాయి. సమ్మెకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.

సార్వత్రిక సమ్మెలో మేము సైతం
ఇక తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే, లారీ, ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. సమ్మెకు రహదారి రవాణాసంస్థ, రైల్వే, ఆటో, లారీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications