For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

By Nageswara Rao
|

దేశీయ ఆర్ధిక వ్వవస్ధకు అత్యంత కీలక బ్యాంకులుగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ బ్యాంకులు భారీ స్ధాయిలో ఆర్ధిక సేవలు అందిస్తున్నందున సంగతి తెలిసిందే.

ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, ఆర్ధిక సేవల్లో అంతరాయాన్ని నివారించేందుకు, ఉన్నత స్ధాయిలో పర్యవేక్షణ బాధ్యతలను ఈ బ్యాంకులకు అప్పగించింది. దేశీయ దైహిక ముఖ్య బ్యాంకులు (డీఎ-ఎస్‌ఐబీ)గా వాటిని గుర్తిస్తున్నట్లు ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది.

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

ఈ రెండు బ్యాంకుల్లో ఏది విఫలమైనా దేశంలో ఆర్థిక సేవలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున వీటిపై అత్యున్నత స్థాయి పర్యవేక్షణ అవసరమని ఆర్‌బీఐ పేర్కొంది.

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

డీ-ఎస్ఐబీ నిబంధనల ప్రకారం, ఒక నిర్దిష్ట ప్రమాణాన్ని ఆర్‌బీఐ గుర్తిస్తుంది. అంతకంటే మెరుగ్గా ఉన్న వాటినే డీ-ఎస్ఐబీలుగా పరిగణిస్తుంది. 2008లో అమెరికాలోని లెహ్‌మన్ బ్రదర్స్ సంస్థ దివాళా తీయడంతో మొదలైన సంక్షోభం ఆ దేశంతోపాటు మొత్తం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టింది.

 కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని 2013లో ఆర్‌బీఐ కీలక బ్యాంకుల హోదా ఇవ్వాలని ప్రతిపాదించింది. మన దేశంలో 4-6 బ్యాంకులు ఈ హోదాకు అర్హత పొందవచ్చని, ప్రతియేటా ఆగస్టులో ఈ హోదాకు అర్హత పొందిన బ్యాంకుల పేర్లను ప్రకటించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

ఈ నిబంధన ప్రకారం బ్యాంకులు అదనపు మూలధనం నిల్వలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు బ్యాంకులకు ఏప్రిల్ 1, 2016 నుంచి మూలధన నిబంధన అమలులోకి వస్తుంది. ఎస్‌బీఐ విషయానికొస్తే నష్టపోయే అవకాశమున్న ఉన్న ఆస్తుల్లో 0.8 శాతానికి సమానమైన అదనపు మూలధన నిల్వలను సమీకరించాల్సి ఉంటుంది.

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

ఐసీఐసీఐ బ్యాంక్ విషయంలో ఈ వాటా 0.2 శాతంగా ఉంది. ఏదేని సంస్థ దివాళా తీస్తే వ్యవస్థ మొత్తం కుప్పుకూలే ప్రమాదం ఉన్న (టూ బిగ్ టు ఫెయిల్) వాటికి ఈ దర్జా కల్పిస్తారు. ఈ హోదా ఉన్న బ్యాంకులు ఒత్తిడిలో ఉంటే ప్రభుత్వం తరపున సహకారం లభిస్తుంది.

English summary

కీలక బ్యాంకుల హోదాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ | RBI names SBI, ICICI as 'too big to fail' banks

Reserve Bank of India (RBI) released its list of Domestic Systemically Important Banks on Monday. The list features names like State Bank of India (SBI) and ICICI Bank.
Story first published: Tuesday, September 1, 2015, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X