విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఇందుకు కారణం విమాన టిక్కెట్లపై 2 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం భావించడమే. త్వరలో ప్రభుత్వం వెలువరించే కొత్త పౌర విమానయాన విధానంలో ఈ మార్పు చోటు చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఈ సుంకం నిధులతో ఈశాన్య రాష్ట్రాల వంటి మారుమూల ప్రాంతాల్లోని విమానాశ్రయాలకు విమాన సర్వీసులను నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం దీనిపై చర్చలు తుది దశలో ఉన్నాయి. దేశంలో విమానయానానికి కొత్త రూపు ఇవ్వడంతో పాటు నష్టాలున్నా, ఈశాన్య రాష్ట్రాలకు సైతం రెగ్యులర్‌గా విమాన సర్వీసులు నడపాలని ప్రభుత్వం భావిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం
విమానయాన రంగం అభివృద్ధికి దీర్ఘకాల వ్యూహాన్ని ఈ విధానం అందిస్తుందని వివరించారు. రద్దీ సీజన్‌లు, సమయాల్లో విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ల ధరలు నిర్ణయించడాన్ని సైతం నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం
దీనిపై ప్రధాని మోడీ సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ ఈ విషయం చెప్పారు.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం
దీని వలన మొత్తం పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోందని ప్రధాని చెప్పినట్టు తెలిపారు. ఇందుకోసం మూడు విధానాలు పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. విమానయాన సంస్థలను విశ్వాసంలోకి తీసుకుని, పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని చెప్పడం అందులో ఒకటి.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం
పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) ద్వారా టికెట్ల ధర నిర్ణయించడం రెండోది. అప్పటికీ కంపెనీలు దారికి రాకపోతే ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా ఛార్జీల ఆధారంగా టికెట్ల ధరలు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశీయ విమాన సంస్థలు విదేశాలకు విమానాలు నడపడంపై ఉన్న నిబంధనలు మార్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం
గురువారం పౌర విమానయానంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ కొత్త విధానంతో దేశంలో పర్యాటక పరిశ్రమ సైతం ఊపందుకుంటుందన్నారు. విమానాల ద్వారా సరుకులు, ప్రయాణికుల రవాణాకు ప్రాంతీయ స్థాయిలో మన దేశాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు చెప్పారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications