మార్కెట్ ఢమాల్: రెండేళ్ల కనిష్టానికి రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1133 పాయింట్లకు పైగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 316 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు చూచిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం రూపాయి మారకపు విలువ 66.49 వద్ద కొనసాగుతోంది. దీంతో ప్రధాన కంపెనీల షేర్లన్నీ నష్టాల బాట పడుతున్నాయి.

మార్కెట్ ఢమాల్: రెండేళ్ల కనిష్టానికి రూపాయి
స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1133 పాయింట్లకు పైగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 316 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మార్కెట్ ఢమాల్: రెండేళ్ల కనిష్టానికి రూపాయి
స్టాక్ మార్కెట్ల పతనంపై ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ మాట్లాడుతూ చైనా ఆర్థిక వ్యవస్థ కారణంగానే మన స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయని తెలిపారు. స్టాక్ మార్కెట్ల పతనంపై ఆయన ముంబైలో సోమవారం ఒక ప్రకటన చేశారు.

మార్కెట్ ఢమాల్: రెండేళ్ల కనిష్టానికి రూపాయి
చైనా యూరోను కుదించడంతోనే అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవాల్సి అవసరం ఉందని అన్నారు. ఆర్థిక బలోపేతానికి సంస్కరణలు అవసరమన్నారు.

మార్కెట్ ఢమాల్: రెండేళ్ల కనిష్టానికి రూపాయి
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పతనంతో భారత ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి మరింత పెరుగుతోందని, ప్రాజెక్టులను మరింత వేగంగా చేపట్టాని ఆయన అన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉందని వివరించారు. రిజర్వు బ్యాంకు ప్రభుత్వంతో కలిసే పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications