న్యూఢిల్లీ: విద్యా రుణాలకు సంబంధించిన వివరాల కోసం ఎదురు చూసే విద్యార్ధులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. దాని పేరు విద్యా లక్ష్మీ (www.vidyalakshmi.co.in). స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సైట్‌ను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సింగిల్ విండో పద్ధతిలో విద్యారుణాలను అందించేందుకు రూపొందించిన మొట్టమొదటి వెబ్‌సైట్ ఇది. రుణాలు కావాలనుకునేవారు www.vidyalakshmi.co.in అనే పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. ఈ సైట్ ద్వారా విద్యార్థులు ఒకే ఫారం ద్వారా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే వీలుంది.

ఎడ్యుకేషన్ లోన్ కోసం ‘విద్యాలక్ష్మి' వెబ్‌సైట్
ఈ వెబ్‌సైట్ ద్వారా తమ రుణం ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ వెబ్‌సైట్‌లో దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఇచ్చే విద్యా రుణాల సమాచారం, లోన్ అప్లికేషన్స్ సమచారం పూర్తిగా అందుబాటులో ఉంటుంది. విద్యార్ధులు తమకున్న సందేహాలను ఈమెయిల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

ఎడ్యుకేషన్ లోన్ కోసం ‘విద్యాలక్ష్మి' వెబ్‌సైట్
13 బ్యాంకులు తాము అందిస్తున్న 22 రకాల విద్యా రుణ పథకాలను ఇందులో నమోదు చేశాయి. లోన్ ప్రాసెసింగ్ వివరాలను ఎప్పటికప్పుడు విద్యార్థులు తెలుసుకునేందుకు వీలుగా ఎస్‌బిఐ, ఐడిబిఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఐదు బ్యాంకులు ఈ పోర్టల్‌లో రుణాలకు సంబంధించిన విధానాలను పొందుపరిచారని తెలిపింది.
ఎడ్యుకేషన్ లోన్ కోసం ‘విద్యాలక్ష్మి' వెబ్‌సైట్
ప్రధానమంత్రి విద్యా లక్ష్మి కార్యక్రమం ద్వారా విద్యారుణాలు, ఉపకార వేతనాలను పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ సాయంతో పర్యవేక్షిస్తామని 2015-16 బడ్జెట్ ప్రసంగంలోనే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎడ్యుకేషన్ లోన్ కోసం ‘విద్యాలక్ష్మి' వెబ్‌సైట్
దానిని అమలుచేసేందుకు, ఆర్థిక భారం కారణంగా ఏ విద్యార్థీ చదువును అర్ధాంతరంగా ఆపేయకూడదనే ఉద్దేశంతో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications