అగ్రస్థాయికి ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్
ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ తాజాగా 50 కోట్ల డాలర్లు (రూ. 3,269 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్, ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ.. స్నాప్‌డీల్‌లో రూ. 3,269 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
ఇప్పటికే తమ సంస్ధలో పెట్టుబడి పెట్టిన టిమ్‌సెక్, బ్లాక్‌రాక్, మైరాయిడ్, ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టారని స్నాప్‌డీల్ సీఈఓ, వ్వవస్ధాపకుల్లో ఒకరైన కునాల్ బహాల్ తెలిపారు. అయితే స్నాప్‌డీల్‌లో ఎవరెవరు ఎంతమేరకు పెట్టుబడులు పెట్టారన్నది మాత్రం ఈ పోర్టల్‌ను నిర్వహిస్తున్న జాస్పర్ ఇన్ఫోటెక్ మాత్రం వెల్లడించలేదు.

అనతికాలంలో అగ్రస్థాయికి ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్
ఫాక్స్‌కాన్‌కు చెందిన ఎఫ్‌ఐహెచ్ మొబైల్ లిమిటెడ్ ఈబే నుంచి 2,967 కంపల్సరీ కన్వర్టబుల్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్లను 5 కోట్ల డాలర్లకు, జాస్పర్ నుంచి 15 కోట్ల డాలర్లకు 79,113 షేర్లను కొనుగోలు చేసింది.

అనతికాలంలో అగ్రస్థాయికి ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్
రెండు సంవత్సరాల క్రితం పెట్టిన పెట్టుబడులకు మెరుగైన లాభాలు వస్తుండటంతో వాటాలను విక్రయించినట్లు ఈబే తెలిపింది. కాగా స్నాప్‌డీల్‌లో ఈబేకు ఇంకా మెజారిటీ వాటాలుండటం గమనార్హం.

అనతికాలంలో అగ్రస్థాయికి ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్
మరోవైపు ప్రస్తుతం కంపెనీలో ఇన్వెస్టర్లుగా ఉన్న టెమాసెక్, బ్లాక్‌రాక్, మైరిడ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ కూడా ఈ పెట్టుబడుల్లో పాలు పంచుకున్నాయని స్నాప్‌డీల్ వెల్లడించింది.

అనతికాలంలో అగ్రస్థాయికి ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్
స్నాప్‌డీల్ ఇప్పటి వరకు సాఫ్ట్‌బ్యాంక్ (62.7 కోట్ల డాలర్లు), రతన్ టాటా సహా ఇతర ఇన్వెస్టర్ల నుంచి 100 కోట్ల డాలర్లకు (6,500 కోట్ల రూపాయలు) పైగా నిధులను సమీకరించింది.

అనతికాలంలో అగ్రస్థాయికి ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్
తాజా పెట్టుబడులతో స్నాప్‌డీల్ విలువ ఏకంగా కంపెనీ నికర విలువ 4-5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అనతికాలంలో అగ్రస్థాయికి ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్
భారత్‌లో డిజిటల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అంతర్జాతీయ సంస్థలైన ఆలీబాబా, ఫాక్స్‌కాన్, సాఫ్ట్‌బ్యాంక్ వంటి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ చెప్పారు. 2010లో ఆన్‌లైన్ సేవలు ప్రారంభించిన సంస్థ అనతికాలంలో అగ్రస్థాయికి చేరుకుంది.


Click it and Unblock the Notifications