ఇండిగో మెగా డీల్: ఎయిర్‌బస్‌తో ఒప్పందం (ఫోటోలు)
దేశీయ విమానయాన రంగంలో దూసుకుపోతున్న ఇండిగో, తాజాగా తన సర్వీసులను మరింతగా విస్తరించేందుకు గాను భారీ స్ధాయిలో విమానాలను కొనుగోలు చేస్తోంది. 250.. ఎ-320 నియో విమానాలను ఐరోపాకు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండిగో తెలిపింది.
ఈ విమానాల విలువ 2,600 కోట్ల డాలర్లకు (సుమారు 1.55 లక్షల కోట్లు) పైగానే ఉంటుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ విమానాల కొనుగోలుకు సంస్థ ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఒయు) కుదుర్చుకుంది. తాజాగా తుది ఒప్పందంపై సంతకాలు చేశాయి. విమానాల ఆర్డర్లకు సంబంధించి ఎయిర్‌బస్‌కు ఇదే అతిపెద్ద లావాదేవీ.
గతంలో 2005 సంవత్సరంలో వంద ఎ- 320, 2011లో 180.. ఎ-320 విమానాలకు సంస్థ ఆర్డరిచ్చింది. వీటి విలువ 1,100 కోట్ల డాలర్లు. అప్పట్లో ఈ స్థాయిలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడం దేశీయ విమానయాన రంగంలో సంచలనంగా మారింది. 2005 సంవత్సరంలో ఆర్డరిచ్చిన వంద విమానాలను ఇండిగో సంస్థ ఇప్పటికే డెలివరీ తీసుకుంది.

ఇండిగో మెగా డీల్: ఎయిర్‌బస్‌తో ఒప్పందం (ఫోటోలు)
తాజా అర్డర్‌తో ఎ-320 విమానాల కోసం ఇచ్చిన మొత్తం ఆర్డర్ల సంఖ్య 530కి చేరింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ప్రయాణికులకు విమాన సేవలను మరింత చవకగా అందించేందుకు కట్టుబడి ఉన్నామని, ఇందులో భాగంగానే కొత్తగా విమానాలకు ఆర్డర్లు ఇస్తున్నామని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు.

ఇండిగో మెగా డీల్: ఎయిర్‌బస్‌తో ఒప్పందం (ఫోటోలు)
ఎ-320 నియో విమానాల ఇంధన సామర్థ్యం అధికంగా ఉంటుందని, ఫలితంగా తక్కువ ధరకే విమానయాన సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరింత ఎక్కువ మంది కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా సర్వీసులు అందించే అవకాశం తమ సంస్థకు లభించనుందని తెలిపారు.

ఇండిగో మెగా డీల్: ఎయిర్‌బస్‌తో ఒప్పందం (ఫోటోలు)
దీనివల్ల మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించమేకాకుండా వృద్ధిని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఆయన చెప్పారు. కొత్త విమానాల డెలివరీ ప్రక్రియ 2018 సంవ త్సరం నుంచి ప్రారంభం అవుతుంది. 2026నాటికి చివరి విమానం కంపెనీ చేతికి వస్తుంది.

ఇండిగో మెగా డీల్: ఎయిర్‌బస్‌తో ఒప్పందం (ఫోటోలు)
ఇండిగో కార్యకలాపాలు మొదలుపెట్టి తొమ్మిదేళ్లు అవుతోందని, మరో పదకొండేళ్లకు సంబంధించిన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని ఘోష్ చెప్పారు. ఇప్పటి వరకు 100 విమానాలకు నిధులను సమకూర్చుకున్నామని, మిగతా విమానాలకు కూడా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం లేదని ఆయన చెప్పారు. కొత్త విమానాలకు అవసరమైన సొమ్మును సమకూర్చేందుకు చాలా సమయం ఉందన్నారు.

ఇండిగో మెగా డీల్: ఎయిర్‌బస్‌తో ఒప్పందం (ఫోటోలు)
తాజాగా విమాన ఆర్డర్లను ఖరారు చేయడం పట్ల ఎయిర్‌బస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాన్ లేహి హర్షం వ్యక్తం చేశారు. కొత్త ఎ 320 నియో విమానాల్లో నవతరం ఇంజన్లు, భారీ షార్క్‌లెట్ వింగ్ టిప్ డివైజెస్ ఉన్నాయన్నారు. ఈ విమానాలు ప్రారంభం నుంచి 15 శాతం అధిక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని, 2020నాటికి ఇంధన సామర్థ్యం 20 శాతం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇండిగో మెగా డీల్: ఎయిర్‌బస్‌తో ఒప్పందం (ఫోటోలు)
ఇండిగో సంస్ధ 2009 సంవత్సరం నుంచి లాభాల బాటలో నడుస్తోంది. విస్తరణకు అవసరమైన నిధుల కోసం తొలి పబ్లిక్ ఇష్యూ ద్వారా 2,500 కోట్ల రూపాయలు సమీకరించాలని సంస్థ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications