బ్యాంకులపై తగ్గిన ఫిర్యాదులు: వీటిపైనే ఎక్కువ
హైదరాబాద్: బ్యాంకులపై ఫిర్యాదులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ డాక్టర్ కృష్ణమోహన్ వెల్లడించారు. అంతేకాదు బ్యాంకింగ్ సేవల్లో లోపాలకు సంబంధించి బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌కు అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు సంబంధించినే ఉన్నాయని పేర్కొన్నారు.
2014-15 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకింగ్ సేవల్లో లోపాలకు సంబంధించి తమకు అందిన ఫిర్యాదుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలీస్తే స్వల్పంగా తగ్గాయని అన్నారు. గతేడాది తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ల్లో బ్యాంకులపై వచ్చిన ఫిర్యాదులు 2.48 శాతం తగ్గి 4,366కి చేరాయని ఆయన చెప్పారు.

బ్యాంకులపై తగ్గిన ఫిర్యాదులు: వీటిపైనే ఎక్కువ
అంతక్రితం ఏడాది ఇదే సమయంలో 4,477 ఫిర్యాదులు వచ్చాయి. దీంట్లో తెలంగాణ నుంచి 2,143 ఫిర్యాదులు రాగా, అదే ఏపీ నుంచి 2,223 చొప్పున వచ్చాయన్నారు. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గ్రూపునకు చెందిన బ్యాంకులపై అధికంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇరు రాష్ర్టాల్లో 2,800 శాఖలు నిర్వహించడం వల్లనే ఎస్‌బీఐ గ్రూపుపై 44 శాతం ఫిర్యాదులు వచ్చేందుకు కారణమైనట్లు ఆయన తెలిపారు.

బ్యాంకులపై తగ్గిన ఫిర్యాదులు: వీటిపైనే ఎక్కువ
అలాగే జాతీయ బ్యాంకులపై 28 శాతం రాగా, ప్రైవేట్ రంగ సంస్థలపై 19 శాతం, విదేశీ బ్యాంకులపై 4 శాతం చొప్పున వచ్చాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 39 శాతం రాగా, పట్టణాల నుంచి 32 శాతం, గ్రామీణ, చిన్న పట్టణాల నుంచి 29 శాతం వచ్చాయి. ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీల నుంచి వచ్చే ఫిర్యాదుల వాటా 25.4 శాతంగా ఉంది.

బ్యాంకులపై తగ్గిన ఫిర్యాదులు: వీటిపైనే ఎక్కువ
ముఖ్యంగా ఖాతాదారుడు ఇతర రాష్ర్టాలకు వెళ్లినప్పుడు ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసినప్పటికీ నగదు రాకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు అంబుడ్స్‌మెన్ కృషి చేస్తున్నట్లు, ముఖ్యంగా సీసీ టీవీ కెమెరాలో రికార్డు ఆధారంగా సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఏటీఎం, డెబిట్ కార్డుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రిజర్వు బ్యాంక్ సరికొత్త మార్గదర్శకాలను రూపొందించిందని తెలిపారు.

బ్యాంకులపై తగ్గిన ఫిర్యాదులు: వీటిపైనే ఎక్కువ
సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదార్లు తమ ఏటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. కార్డుల ద్వారా జరిగే మోసాలను అడ్డుకోవడానికి ఎలక్ట్రానిక్ చిప్ కార్డులను జారీ చేయడానికి బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయని వివరించారు.


Click it and Unblock the Notifications