నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (43) గూగుల్ అల్ఫాబేట్ కొత్త సీఈఓగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని సంస్ధ ప్రతినిధులు సోమవారం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

గూగుల్‌లో జరుగుతున్న మేనేజ్‌మెంట్ మార్పుల్లో భాగంగా గూగుల్ ఆల్ఫాబేట్ పేరిట మరో కొత్త సంస్ధను ఏర్పాటు చేస్తున్నారు.

గూగుల్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచంలో ఓ టెక్ వార్‌కు తెరలేవనుందా అంటే అవుననే అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. మొబైల్ రంగంలో సంభవించిన పెను మార్పులకు అనుగుణంగా గూగుల్ కొత్త సీఈఓ సుందర్ పిచాయ్, భారత సంతతికి చెందిన మరో సీఈఓ సత్య నాదెళ్లను ఢీకొట్టబోతున్నారు.

ఇద్దరు కూడా మొబైల్‌కు సంబంధించిన ప్రొడక్ట్ ఉత్పత్తుల్లో దిట్టలు. ఇద్దరూ కూడా ప్రపంచంలో ఉన్న అతి పెద్ద టెక్నాలజీ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. మైక్రోసాప్ట్ సీఈఓగా ఉన్న సత్య నాదెళ్ల ఆపరేటింగ్స్ సిస్టమ్స్, హార్డ్‌వేర్ ద్వారా ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఏలాలని కృషి చేస్తున్నారు.

ఇక సుందర్ పిచాయ్ గూగుల్ ప్రొడక్టు మేనేజ్మెంట్ విభాగంలో చేరి, విప్లవాత్మక గూగుల్ క్రోమ్ తయారీ టీమ్‌కు నేతృత్వం వహించారు. అతి తక్కువ కాలంలో ఫైర్ ఫాక్స్, గూగుల్ టూల్ బార్, డెస్క్ టాప్ సెర్చ్, గాడ్జెట్స్ రూపకల్పనలో భాగం పంచుకున్నారు.

సెప్టెంబర్ 2008లో క్రోమ్ వెబ్ బ్రౌజర్ ఆవిష్కరణ అనంతరం ఏడాదిలోనే నోట్ బుక్స్, డెస్క్‌టాప్‌లకు క్రోమ్ బ్రౌజర్‌ను తయారు చేసి సంస్థ ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు. సుందర్ పిచాయ్ చెన్నైకి చెందిన వ్యక్తి కాగా, సత్య నాదెళ్ల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి.

నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

గూగుల్ కంపెనీ నుంచి సెర్చ్ ఇంజన్ క్రోమ్ రాగా, మైక్సోసాప్ట్ నుంచి బింగ్ అనే సెర్చ్ ఇంజన్‌ను ఉంది. ఇటీవల కాలంలో బింగ్ సెర్చ్ ఇంజన్‌ను వినియోగించే వారి సంఖ్య పెరిగింది. ఇటీవల విడుదల చేసిన విండ్సో 10 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మొబైల్ కస్టమర్స్‌కు మైక్రోసాప్ట్ పరికరాల మధ్య కొత్త ఎక్స్ పీరియన్స్‌ని కస్టమర్స్‌కు అందించింది.

 నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

ఇదే గనుక విజయవంతమైతే మైక్రోసాప్ట్ ఫోన్‌లో ప్రస్తుతం గూగుల్ సెర్చ్ ఇంజన్ స్ధానంలో త్వరలో బింగ్ సెర్చ్ ఇంజన్ రానుంది. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజిన్ గట్టి పోటీ ఇస్తుంది. ఇలా భారత సంతతికి చెందిన ఇద్దరూ సీఈఓలు భారతదేశ ప్రతిభను, ఖ్యాతిని ప్రపంచమంతా చాటుతున్నారు.

నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

2014 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు చెందిన సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా నియమితులయ్యారు. ఆయన మైక్రోసాఫ్ట్‌లో 22ఏళ్లు పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. సీఈఓగా కంటే ముందు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

నాదెళ్ల Vs పిచాయ్: మొబైల్ వార్ రానుందా?

గూగుల్‌ సంస్థ అనుసంధానంతో కొత్తగా ప్రారంభిస్తున్న గూగుల్‌ ఆల్ఫాబెట్‌ విభాగానికి భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ను సీఈఓగా ప్రకటించారు. చెన్నైకి చెందిన సుందర్‌ పిచాయ్‌ 2004వ సంవత్సరంలో గూగుల్‌ సంస్థలో చేరిన సుందర్‌ ప్రస్తుతం సీఈఓ స్థాయికి ఎదిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+