ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్దగా పేరున్న చైనా ఈ ఏడాది ఆర్ధిక వృద్ధి 25 ఏళ్ల కనిష్టానికి చేరనుందనే అంచనాలు ఊపందుకున్నాయి. ఎగుమతులు క్షీణించడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా చైనా ఆర్ధిక వ్యవస్ధను గట్టెక్కించేందుకు మంగళవారం చైనా సెంట్రల్ బ్యాంక్ ఆదేశ కరెన్సీ విలువను 2 శాతం తగ్గించింది.
దీంతో ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చైనా యువాన్ విలువ అంతే మొత్తంలో తగ్గింది. 1994లో భారీ తగ్గింపు తర్వాత మళ్లీ ఒక్కరోజులో యువాన్ విలువ రెండు శాతం తగ్గడం దశాబ్దకాలంలో ఇదే మొదటిసారి. దీని ప్రభావం భారత కరెన్సీపై స్పష్టంగా కనిపించింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్ఠానికి దిగజారింది.
బుధవారం నాడు ఫారెక్స్ సెషన్ మొదలు కాగానే రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే ఒక శాతానికి పైగా పడిపోయింది. సెప్టెంబర్ 2013 తరువాత తొలిసారిగా రూపాయి విలువ 64.85కు చేరింది. సెషన్ ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 150 పాయింట్లు నష్టపోయింది.
నిఫ్టీ అత్యంత కీలకమైన 8,400 పాయింట్ల స్థాయికి చేరుకుంది. చైనాలోని కంపెనీలకు ఎగుమతులు చేసే భారత సంస్థల ఈక్విటీ విలువలు తగ్గిపోయాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ 65 రూపాయలను దాటుతుందని నిర్మల్ బాంగ్ సెక్యూరిటీస్ అనలిస్ట్ మహమ్మద్ ఘజియానీ అభిప్రాయపడ్డారు.

కరెన్సీ విలువను 2% తగ్గించిన చైనా: రుపీపై ఒత్తిడి పెరగనుందా?
మరోవైపు చైనా తన కరెన్సీ వ్యవస్ధను సంస్కరించిన (2005) తర్వాత నమోదైన భారీ క్షీణత కూడా ఇదే. ఈ పరిణామంతో భారతీయ రూపాయిపై ఒత్తడి పెరగనుందని, మన దేశ వస్తు ఉత్పత్తి రంగంతో పాటు ఎగుమతి వాణిజ్యానికి ఈ అంశం ప్రతికూలంగా పరిణమించనుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

కరెన్సీ విలువను 2% తగ్గించిన చైనా: రుపీపై ఒత్తిడి పెరగనుందా?
యువాన్ విలువ తగ్గడంతో ఎగుమతుల విషయంలో భారత్ కంటే చైనా మార్కెట్ ఆకర్షణీయంగా మారనుందని డెస్టిమోని సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ సుదీప్ బంధోపాధ్యాయ్ అన్నారు. యువాన్‌లో క్షీణతకు తగ్గ స్థాయిలోనే రూపాయి విలువ కూడా తగ్గవచ్చని లేదంటే మన ఎగుమతిదారుల ఇబ్బందులు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

కరెన్సీ విలువను 2% తగ్గించిన చైనా: రుపీపై ఒత్తిడి పెరగనుందా?
త్వరలో కరెన్సీ యుద్ధం మొదలవనుందా అంటే అవుననే అంటున్నారు ఆర్ధిక నిపుణులు. అంతర్జాతీయంగా ఆర్ధిక పరిస్ధితులు సంక్లిష్టంగా ఉన్నాయి. అమెరికా డాలర్ బలోపేతం అవుతుంది. యూరో, జపాన్ యెన్ బలహీన పడుతున్నాయి. వర్ధమాన దేశాల కమొడిటీ ధరల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

కరెన్సీ విలువను 2% తగ్గించిన చైనా: రుపీపై ఒత్తిడి పెరగనుందా?
దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరెన్సీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చైనా తన మారక విలువను తగ్గించిన నేపథ్యంలో మంగళవారం ముడి చమురు ధరలు సైతం పడ్డాయి. గత ఏడాది కాలంగా ముడి చమురు ధరలకు చైనా కూడా కారణమని చెప్పవచ్చు.

కరెన్సీ విలువను 2% తగ్గించిన చైనా: రుపీపై ఒత్తిడి పెరగనుందా?
ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా ఒకటి. చైనా నుంచి గిరాకీ తగ్గితే పరిస్ధితి ఏమవుతుంది. సరఫరా పెరుగుతున్నా గిరాకీ తగ్గడంతో మంగళవారం బ్రెంట్ ప్యూచర్ ధర 10 సెంట్లు తగ్గి బారెల్ 50.31 డాలర్లుగా పలికింది.

కరెన్సీ విలువను 2% తగ్గించిన చైనా: రుపీపై ఒత్తిడి పెరగనుందా?
చైనా కరెన్సీ విలువని రెండు శాతం తగ్గించిన ప్రభావం ఐరోపా దేశాలపై కూడా పడింది. ముఖ్యంగా కార్ల తయారీ కంపెనీల షేర్లలో అది స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఐరోపా కార్ల తయారీదార్లకు చైనా ప్రధానమైన ఎగుమతి మార్కెట్ కావడమే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications