ముంబై: కోచింగ్ సెంటర్ల వల్లే భారత్‌లో ప్రఖ్యాత విద్యాలయాలైన ఐఐటీల ప్రతిష్టకు గండిపడుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. విద్యార్ధుల నుంచి కోట్లు దండుకుంటున్న కోచింగ్ సెంటర్లు ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడమెలాగో నేర్పిస్తున్నాయని, ఈ క్రమంలో తెలివైన వారికి సీటు దక్కకుండా పోతుందని అన్నారు.
అటు యవతకు, మరికొన్ని సందర్భాల్లో బయటివారికి ఐఐటీలపై మోజు తగ్గిందని సోమవారం ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ విద్యార్ధులను ఉద్దేశించిన ప్రసంగంలో మూర్తి పేర్కొన్నారు. స్వేచ్ఛగా, భిన్నంగా ఆలోచించే విద్యార్ధులు చదువుకోవడం వల్లనే గతంలో ఐఐటీలకు గౌరవం దక్కిందని చెప్పారు.

ఐఐటీలపై ఇన్ఫోసిస్ మూర్తి అభిప్రాయం ఇదీ
కోచింగ్ సెంటర్ల వల్లే భారత్‌లో ప్రఖ్యాత విద్యాలయాలైన ఐఐటీల ప్రతిష్టకు గండిపడుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. విద్యార్ధుల నుంచి కోట్లు దండుకుంటున్న కోచింగ్ సెంటర్లు ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడమెలాగో నేర్పిస్తున్నాయని, ఈ క్రమంలో తెలివైన వారికి సీటు దక్కకుండా పోతుందని అన్నారు.

ఐఐటీలపై ఇన్ఫోసిస్ మూర్తి అభిప్రాయం ఇదీ
నారాయణ మూర్తి కూడా ఐఐటీ కాన్పూర్ నుంచి టెక్నాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. ఇటీవల కాలంలో ఐఐటీల్లో మధ్యలోనే చదువుమానేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో నారాయణ మూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఐఐటీలపై ఇన్ఫోసిస్ మూర్తి అభిప్రాయం ఇదీ
గత నెలలో పేలవమైన ప్రదర్శననను కనబర్చిన 75 మంది విద్యార్ధులను ఐఐటీ రూర్కెలా నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో తిరిగి మళ్లీ వారిని ఐఐటీలో చేర్చుకోవడం జరిగింది. దీంతో ఇటీవల కాలంలో ఐఐటీల ప్రతిష్ట క్రమేపీ తగ్గుతుందని పలువురు వాదిస్తున్నారు.

ఐఐటీలపై ఇన్ఫోసిస్ మూర్తి అభిప్రాయం ఇదీ
దీంతో పాటు దేశంలో అణు విద్యుత్ అవసరమేనని మూర్తి అభిప్రాయపడ్డారు. అణు విద్యుత్ సామర్థ్యం పెంచుకోవడంపై కేంద్రం మరింత దృష్టి పెట్టాలని అన్నారు. అప్రమత్తంగా ఉండటంతోపాటు అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించినంత వరకు అణు విద్యత్తు ఉత్పత్తి విషయంలో ఎలాంటి భయాలు అక్కర్లేదని మూర్తి పేర్కొన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications