For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

By Nageswara Rao
|

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌ నుంచి రుణ బకాయిలను వసూలు చేసేందుకు బెంగుళూరులో ఆ కంపెనీకి చెందిన స్ధిరాస్తిని ఆంధ్రా బ్యాంక్ సెప్టెంబర్ 10న ఈ వేలం వేయనుంది. డెక్కన్ క్రానికల్ నుంచి ఆంధ్రాబ్యాంక్ కు సుమారు రూ. 200 కోట్లు రావాల్సి ఉంది.

వీటిని రాబట్టుకునేందుకు ఈ వేలం ద్వారా స్ధిరాస్తిని విక్రయించనున్నట్లు బ్యాంకుకు చెందిన ఉన్నత స్ధాయి వర్గాలు తెలిపాయి. బెంగుళూరులోని ప్రింటింగ్ భవనంకు సంబంధించిన స్ధలాన్ని డెక్కన్ క్రానికల్ ఆంధ్రా బ్యాంకులో హామీగా పెట్టి రుణం తీసుకుంది.

 వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌ నుంచి రుణ బకాయిలను వసూలు చేసేందుకు బెంగుళూరులో ఆ కంపెనీకి చెందిన స్ధిరాస్తిని ఆంధ్రా బ్యాంక్ సెప్టెంబర్ 10న ఈ వేలం వేయనుంది. డెక్కన్ క్రానికల్ నుంచి ఆంధ్రాబ్యాంక్ కు సుమారు రూ. 200 కోట్లు రావాల్సి ఉంది.

 వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

అందులోని ప్రింటింగ్ యంత్రాలను మరో బ్యాంకుకు హామీగా పెట్టిందని ఆంధ్రాబ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఈ రెండు బ్యాంకులు కలిసి ప్రింటింగ్ భవనాన్ని, అందులోని యంత్రాలను వేలం వేసేందుకు ముందుకు వచ్చాయని సమాచారం.

 వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

అంతేకాదు కర్ణాటకలోని ప్రింటింగ్ సంస్ధలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాయని బ్యాంకు వర్గాలు వివరించాయి. 2013లో వచ్చిన సెక్యూరిటైజేషన్ అండ్ రికనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అెసట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్‌లోని నిబంధనల ప్రకారం చెన్నై, బెంగుళూరులోని డెక్కన్ క్రానికల్‌కు చెందిన రూ. 160 కోట్ల విలువైన ఆస్తులను గతంలోనే ఆంధ్రాబ్యాంకు ఆధీనంలోకి తీసుకుంది.

 వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి

ఆంధ్రాబ్యాంకుతో పాటు యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీహెచ్, కార్పోరేషన్ బ్యాంకులు డెక్కన్ క్రానికల్‌కు భారీగా రుణాలను మంజూరు చేశాయి. వీటిలో కొన్ని బ్యాంకులు తమ రుణాలను వసూలు చేసుకునేందుకు కేసులు కూడా పెట్టాయి. డెక్కన్ క్రానికల్‌కు మొత్తంగా రూ. 4,000 కోట్ల అప్పులున్నాయి.

English summary

వేలానికి డెక్కన్ క్రానికల్ బెంగుళూరు స్ధిరాస్తి | Andhra Bank to auction Deccan Chronicle properties

Andhra Bank will auction Deccan Chronicle Holdings Ltd's (DCHL) immovable property in Bengaluru on September 10, 2015 through e-auction to recover the loan dues.
Story first published: Thursday, August 6, 2015, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X