తిరుమల తిరుపతి దేవస్ధానానికి విరాళాలిచ్చే భక్తులకు కొత్త అవకాశాన్ని కల్పించింది. ఇకపై స్వామి వారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలోనూ విరాళాలు సమర్పించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇందుకు సంబంధించి టీటీడీ కొత్తగా డీమ్యాట్ అకౌంట్‌ను ప్రారంభించింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఇప్పటివరకూ కానుకల రూపంలో భూములు, నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వంటికి హుండీలో వేస్తున్నారు. అప్పుడప్పుడూ షేర్లను సర్టిఫికెట్ల రూపంలో స్వామివారి పేరిట రాసి హుండీలో వేస్తున్నారు. అయితే, సర్టిఫికేట్ల రూపంలో వచ్చే ఆ షేర్లను మార్చుకోవడంలో టీటీడీ అధికారులకు ఇబ్బందిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా రూ. కోటి 80 లక్షల విలువైన షేర్లు టీటీడీ వద్ద ఉన్నాయి. ఇలా స్వామివారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో కానుకలు బదిలీ చేయాలనుకునే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ తిరుమల వెంకన్న పేరిట డీమ్యాట్ ఖాతాను తెరిచారు. ఈ నిర్ణయంతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు, సెక్యూరిటీ బాండ్ల బదిలీ, జమ చేసే వెసులుబాటు కలిగింది.

శ్రీవారిపై షేర్లు: డీమ్యాట్ ఖాతా ప్రారంభించిన టీటీడీ
సోమవారం టీటీడీ ఈవో సాంబశివరావు సెంట్రల్ డిపాజిటర్ సర్వీసెస్ (సీడీఎస్ఎస్) అధికారులకు డీమ్యాట్ ఖాతా పత్రాలను అందజేశారు. ఈ ఖాతా నెం. 1601010000384828 గా ఉంది. ఈ సందర్భంగా సంస్ధ ప్రతినిధులు టీటీడీ ఈవోతో సమావేశమై డీమ్యాట్ అకౌంట్ ప్రాముఖ్యతను వివరించారు.

శ్రీవారిపై షేర్లు: డీమ్యాట్ ఖాతా ప్రారంభించిన టీటీడీ
ఈ కార్యక్రమంలో సీడీఎస్ఎస్ చైర్మన్ ఎస్. రంగాచారి, ఎండీ పీఎస్ రెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజి, హెచ్‌సీఐఎల్ సీఈవో రమేష్‌లు పాల్గొన్నారు. డీమ్యాట్ అకౌంట్ ప్రారంభం కావడంతో మంగళవారం నుంచి భక్తుల వద్ద నుంచి షేర్లు, సెక్యూరిటీస్ రూపంలో విరాళాల సేకరణ చేపడతారు.

శ్రీవారిపై షేర్లు: డీమ్యాట్ ఖాతా ప్రారంభించిన టీటీడీ
దేశవ్యాప్తంగా 28 వేల పోస్టాఫీసుల్లో శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది. పోస్టల్ శాఖకు ‘నేషనల్ బిల్లర్' పోర్టల్ అనుమతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై విధి విధానాలను మంగళవారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఈవో సాంబశివరావు, టీటీడీ, పోస్టల్ ఉన్నతాధికారుల సమావేశంలో ఖరారు చేశారు.

శ్రీవారిపై షేర్లు: డీమ్యాట్ ఖాతా ప్రారంభించిన టీటీడీ
ప్రస్తుతం పోస్టల్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 160 పోస్టాఫీసుల్లో రూ.300 దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications