హైదరాబాద్: భారత్‌లో 10.5 శాతం వాటా కలిగిన, స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న ఇంటెక్స్ సంస్థ, తన ఉత్పత్తుల ప్రచారం నిమిత్తం బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్‌స్టార్ మహేష్ బాబును ఎంచుకుంది. సోమవారం మద్యాహ్నాం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇంటెక్స్ ప్రతినిధులు మహేష్ బాబుతో కుదుర్చుకున్న ఈ ఒప్పంద వివరాలను వెల్లడించారు.

'వినియోగదారులు కోరుకునే పటిష్టమైన ఉనికి, స్టయిల్, విలువ లాంటి వాటన్నింటినీ కలిగి ఉండే ఇంటెక్స్ వంటి బ్రాండ్‌తో అనుబంధం ఎంతో ఆనందదాయకం. భారతదేశ ప్రజానీకం నిరంతరంగా మార్పు చెందుతూ వస్తోంది. తాము కోరుకునే అంశాల్లో సహజ విలువను ప్రశంసించడం అధికమైపోతోంది. ఇటీవలి కాలంలో చక్కటి పనితీరును ప్రదర్శించిన ఇంటెక్స్ సాధారణ ప్రజానీకంతో పటిష్ట అనుబంధాన్ని కలిగి ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఏపీలో ప్రజలతో ఇంటెక్స్ అనుబంధాన్ని మరింత పటిష్టం చేయడం నాకెంతో ఆనందం' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నారు.

తెలుగు ప్రజలతో ఇంటెక్స్ అనుబంధం గురించి డైరెక్టర్ కేశవ్ బన్సాల్ మాట్లాడుతూ 'తాము చేసే పనిలో ఉత్కృష్టత కనబరిచే అత్యుత్తమ నటుల్లో మహేష్ ఒకరు. కచ్చితమైన ఆటిట్యూడ్‌తో వారు ఆయా పనులు చేస్తుంటారు. ఆయనొక సూపర్ స్టార్. ఏపీలో ఆయనకు ఇంతగా అభిమానులు ఉన్నారంటే అందుకు కారణం ఆయన కఠోర శ్రమ మరియు ప్రేక్షకులను ఆనందింపజేయడంలో ఆయనకు గల అంకితభావం. రాష్ట్రానికి చెందిన ప్రేక్షకులతో మరీ ముఖ్యంగా యువతతో ఆయన అనుబంధం ఏపీలో ఇంటెక్స్ బ్రాండ్ స్ధానాన్ని మరింత ఉన్నత స్ధాయికి చేర్చగలదు' అని అన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications