దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ రాబోయే రోజుల్లో యువత అభిరుచులకు అనుగుణంగా కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందు కోసం అవసరమైన పరిశోధన కోసం ఆర్ అండ్ డి విభాగాన్ని పటిష్ఠం చేస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్2లో వరుణ్ మోటార్స్ సారథ్యంలోని నెక్సా షోరూమ్‌ను, కావూరి హిల్స్‌లో సాబూ ఆర్‌కెఎస్ మోటార్స్ సారథ్యంలో నెక్సా జూబ్లీషోరూమ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ కల్సి మీడియాతో మాట్లాడుతూ మధ్యతరగతికి అందుబాటులో ఉండే కార్లను, విలాసాన్ని, దర్పాన్ని కోరుకునే ఆధునిక తరం యువత, సంపన్నుల అభిరుచులకు అనుగుణంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800
ఇందులో భాగంగా తమ తొలి ప్రయత్నంగా ఈ నెక్సా షోరూమ్‌లని ప్రారంభిస్తున్నామన్నారు. కొత్త ఉత్పత్తులు, ఇంధన సామర్థ్యం గల ఇంజన్లపై పరిశోధన చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది తమ సంస్థ ఆర్ అండ్ డి పటిష్ఠతతోపాటు ప్లాంట్ల సామర్థ్యాల విస్తరణ, ఇతర కార్యకలాపాలపై 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు కల్సి చెప్పారు.

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800
హర్యానాలోని రోహ్‌తక్‌లోని తమ ఆర్ అండ్ డి సెంటర్ 2017నాటికి పూర్తి స్థాయిలో పని ప్రారంభిస్తుందని అన్నారు. మెరుగైన ఇంధన సామర్థ్యం గల కార్లపై అక్కడ ప్రత్యేక పరిశోధనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మారుతి సుజికీ ఆర్ అండ్ డి విభాగంలో 1500 మంది ఇంజనీర్లు పని చేస్తున్నారని చెప్పారు.

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800
ఆగస్టు 5న మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్న ఎస్‌క్రాస్ ఒక ప్రత్యేకతను చాటుతుందని అన్నారు. 2020నాటికి ఏడాదికి 20 లక్షల కార్లను విక్రయించాలన్నది తమ లక్ష్యమని, అందులో భాగంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే పలు కార్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800
అక్టోబర్ నెలలో స్విఫ్ట్, డిజైర్ కొత్త వేరియెంట్లు మార్కెట్లోకి రానున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్ నాటికి మార్కెట్లోకి మారుతి సుజికీ ఆల్టో 800 డీజిల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. గతేడాది తాము 11.7 లక్షల కార్లను విక్రయించామంటూ ఈ ఏడాది మొత్తం కార్ల మార్కెట్లో ఆరు నుంచి ఎనిమిది శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications