రెడ్డీస్ క్యూ1 ఫలితాలు: లాభం రూ. 626 కోట్లు
డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయంలో 7 శాతం, నికరలాభంలో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది.
రష్యా మార్కెట్లో అమ్మకాలు క్షీణించాయి.
అయినా సరే అమెరికా, యూరప్, భారత్‌ల్లో విక్రయాలు అధికంగా ఉండటంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 626 కోట్ల రూపాయలకు చేరిందని కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి చెప్పారు.
గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 550.40 కోట్ల రూపాయలుగా ఉంది. సమీక్షా కాలం లో మొత్తం రాబడులు 6.82 శాతం వృద్ధి చెంది 3,517.54 కోట్ల రూపాయల నుంచి 3,757.80 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు.

రెడ్డీస్ క్యూ1 ఫలితాలు: లాభం 626 కోట్లు
త్రైమాసికంలో రష్యా వ్యాపారం రూ. 420 కోట్ల నుంచి రూ. 230 కోట్లకు పడిపోగా, ఇదే సమయంలో ఇండియా వ్యాపారం రూ. 400 కోట్ల నుంచి రూ. 476 కోట్లకు, ఉత్తర అమెరికా ఆదాయం రూ. 1,620 కోట్ల నుంచి రూ. 1,851 కోట్లకు పెరిగింది.

రెడ్డీస్ క్యూ1 ఫలితాలు: లాభం 626 కోట్లు
ఉత్తర అమెరికాలో మార్కెట్లలో ధరల ఒత్తిడి అధికంగా ఉందని, కొత్త ఉత్పత్తులకు అనుమతి లభిస్తే రానున్న కాలంలో కూడా ఇదే విధమైన ఫలితాలను ప్రకటించగలమని సౌమెన్ ధీమా వ్యక్తం చేశారు.

రెడ్డీస్ క్యూ1 ఫలితాలు: లాభం 626 కోట్లు
ఇక కంపెనీ జెనరిక్ విక్రయాల్లో అమెరికా వాటా దాదాపు 60 శాతం ఉందని అన్నారు. అమెరికా మార్కెట్లో వాల్గాన్‌సిక్లోవిర్, సిరోలిమస్, హబ్రిట్రోల్ వంటి ఔషధాలతో మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నట్లు చక్రవర్తి వెల్లడించారు.

రెడ్డీస్ క్యూ1 ఫలితాలు: లాభం 626 కోట్లు
త్రైమాసిక కాలంలో అమెరికా మార్కెట్లోకి 6 కొత్త ప్రొడక్ట్ ఫైలింగ్స్‌ను దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యుఎస్‌ఎఫ్‌డిఎ) వద్ద మొత్తం 73 అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్ (అండా) పెండింగ్‌లో ఉన్నాయన్నారు.


Click it and Unblock the Notifications